chinese-army-plays-punjabi-songs

చైనా ఆర్మీ చిల్లర పనులు, బోర్డర్ దగ్గర లౌడ్ స్పీకర్లలో పంజాబీ సాంగ్స్ ప్లే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ladakh standoff : భారత జవాన్లపై చైనా అక్కసు ప్రదర్శిస్తోంది. బోర్డర్ లో లౌడ్ స్పీకర్లను అక్కడి ఆర్మీ ఏర్పాటు చేస్తోంది. హిందీ, పంజాబీ పాటలతో రెచ్చగొడుతోంది. చెవులు చిల్లులు పడేలా సౌండ్ పెట్టి..భారతీయ జవాన్లను మానసికంగా దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. నెగటివ్ వైబ్రేషన్స్ కలిగించే పాటలను చైనా సైనికులు ప్లే చేస్తున్నారు.



దీనివల్ల ఇండియన్ సైనికుల ఏకాగ్రత దెబ్బతినే విధంగా వ్యూహం ప్రదర్శిస్తున్నారు. వార్నింగ్ షాట్ ఫైరింగ్ కు చైనీస్ ట్రూప్స్ పాల్పడుతోంది. పాంగాంగ్ సరస్సు, ఫింగర్ 4 సెక్టార్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. 1990లో నాటి పాత పంజాబీ పాటలు ప్లే చేస్తున్నారు.

ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్… ప్రారంభానికి సిద్ధం


ఇలా చేయడం ఆర్ట్ ఆఫ్ వార్ గా విశ్లేషకులు చెబుతున్నారు. 6వ శతాబ్దంలో ఆర్ట్ ఆఫ్ వార్ బుక్ ను సున్ రాశారు. శత్రువుపై మానసికంగా పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
సైకాలజికల్ వార్ కు దిగడం చైనాకు కొత్తేమీ కాదు.



జూన్ 15వ తేదీన 20 మంది భారతీయ సైనికులను చైనా లిబరేషన్ ఆర్మీ పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఆర్థికంగా దెబ్బ తీసేందుకు పలు చర్యలు తీసుకుంది. చైనాకు చెందిన యాప్స్ ను నిషేధించింది. ఓవైపు చర్చలు జరుపుతూనే..కుట్రలకు చైనా పాల్పడుతోందని అంటున్నారు.



భారత్ పై మరింత కక్ష పెంచుకుని సరిహద్దుల్లో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా చైనా చర్యలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తమ ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది.

Related Posts