లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

చైనా కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితమేనంట.. వాలంటీర్లలో ఇమ్యూనిటీని పెంచింది

Published

on

Chinese Covid-19 vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం డజన్ల కొద్ది వ్యాక్సిన్లు ట్రయల్స్ రేసులో ఉన్నాయి. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్లు సురక్షితమంటూ ప్రకటించాయి.

ప్రపంచ దేశాలతో పాటు చైనా కూడా SARS-CoV-2 వైరస్ (CoronaVac) వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.ఇటీవల నిర్వహించిన రాండమైజడ్ క్లినికల్ ట్రయల్స్‌లోతమ వ్యాక్సిన్ కూడా సురక్షితమేనని చైనా ప్రకటించింది.

క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న 18 నుంచి 59ఏళ్ల వయస్సు గల ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లలో రోగ నిరోధకతను ప్రేరేపించిందని వెల్లడించింది.
దీనికి సంబంధించి ఫలితాలను ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించింది. కరోనా క్లినికల్ ట్రయల్స్‌లో ఏప్రిల్ 16, మే5 మధ్య చైనాలో 700 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

వాలంటీర్లకు ఇచ్చిన మోతాదులలో పరీక్షించిన తర్వాత వ్యాక్సిన్ సురక్షితమని తేలింది. ఇంజెక్షన్ వేసిన చోట మాత్రం నొప్పి అనేది సర్వసాధారణంగా దుష్ప్రభావంగా పేర్కొంది.

యోగి సర్కార్ పై WHO ప్రశంసలు


చివరి మోతాదులో 14 రోజులలో ఇచ్చారు. టీకా అభ్యర్థికి రెండు ఇంజెక్షన్లు 14 రోజుల వ్యవధిలో ఇచ్చారు.

వీరిలో బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనలను ప్రేరేపించినట్టు గుర్తించామని కనుగొన్నారు. వ్యాక్సిన్ పరీక్షించిన అతి తక్కువ మోతాదులో (3µg)గా ఉందని అధ్యయనం పేర్కొంది.టీకా ద్వారా ప్రేరేపించిన యాంటీబాడీ స్థాయిలు.. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కంటే తక్కువగా ఉన్నాయని ఫలితాల్లో తేలింది. టీకా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. టీకా అభ్యర్థికి 14 రోజుల వ్యవధిలో రెండు మోతాదులను ఇచ్చామన్నారు.మొదటి రోగనిరోధకత పొందిన 28 రోజుల్లో యాంటీబాడీ ప్రతిస్పందనలను ప్రేరేపించవచ్చని ఫలితాల్లో తేలింది. రెండు మోతాదులతో రోగనిరోధకత పొందిన నాలుగు వారాల్లోనే ‘కరోనావాక్’ వ్యాక్సిన్ యాంటీబాడీ ప్రతిస్పందనను ప్రేరేపించగలదని పరిశోధనల్లో తేలిందని రీసెర్చర్లు తెలిపారు.

అయినప్పటికీ, టీకా షెడ్యూల్ తర్వాత యాంటీబాడీల ప్రతిస్పందన ఎంతకాలం ఉంటుందో తెలియాలంటే మరిన్నిఅధ్యయనాలు అవసరమంటున్నారు.