చైనా ఫోన్స్..యాప్స్ బ్యాన్..భారత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.అందుకనుగుణంగా..భారత్ చర్యలకు ఉపక్రమించింది. తొలుత ఫోన్స్, యాప్స్ పై బ్యాన్ చేసేసేంది. ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి భారత్ అన్ని రకాల చర్యలు తీసుకొంటోంది. చైనా నెటిజన్లు…ఇండియన్ స్టూడెంట్స్ గో బ్యాక్ నినాదాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంో..భారత్ మరో కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.

భారతదేశంలో ఉన్నత విద్యపై చైనా ప్రభావం..పై భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఏడు స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాల సహకారంతో..చైనా చేస్తున్న దానిపై, విశ్వ విద్యాలయాల విషయంలో చైనాతో చేసుకున్న 54 ఒప్పందాలపై సమీక్షించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.IITs, BHU, JNU and NITs ఇతర చైనా ఇనిస్టిట్యూషన్ ఉన్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ..విశ్వ విద్యాలయాల కమిషన్ కు నోటిషికేషన్ విడుదల చేసింది. చైనా భాష, సంస్కృతిని ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో Confucius Institutes లకు నిధులు Ministry of Education of People’s Republic of China నిధులు సమకూరుస్తుంది. ఇనిస్టిట్యూట్స్ మధ్య జరిగిన ఒప్పందాల్లో చట్టాలు ఉల్లంఘించాయా అనే దానిపై ఆస్ట్రేలియ విశ్వ విద్యాలయాలు దర్యాప్తును ప్రారంభించాయి.

Related Posts