Home » కరోనా వైరస్ భారత్‌లోనే పుట్టింది…చైనా శాస్త్రవేత్తలు
Published
2 months agoon
corona virus outbreak కరోనా వైరస్‌తో ఏడాది కాలంగా ప్రపంచం విలవిల్లాడుతోంది. గత ఏడాది నవంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. వూహాన్ సిటీలో కరోనా మహమ్మారి పుట్టిన విషయం యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు.
అయితే, వూహాన్లో కరోనా వైరస్ పుట్టినా.. మిగతా ప్రపంచాన్ని అప్రమత్తంగా చేయకుండా.. ఇంతటి అల్లకల్లోలానికి కారణమైందని ముందు నుంచీ చైనాపై పలు దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పదే పదే ఈ విషయంలో చెనాపై నిప్పులు చెరిగారు. కరోనాను చైనీస్ వైరస్‌గా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా యావత్ ప్రపంచం.. చైనా వైపు వేలెత్తిచూపిస్తున్నా.. డ్రాగన్ మాత్రం వితండ వాదం చేస్తోంది. తమకూ కరోనా వైరస్‌తో సంబంధమే లేదని బుకాస్తోంది. ఈ క్రమంలో కొత్త వాదనను ఎత్తుకున్న చైనా.. భారత్‌పై విషం చిమ్ముతోంది. కరోనా వైరస్ భారత్‌లోనే పుట్టిందని చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరదీశారు.
కరోనాను అడ్డంపెట్టుకొని ఇండియాపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశారు. గత ఏడాది వేసవిలో ఈ వైరస్ పుట్టిందని పేర్కొన్నారు. జంతువుల నుంచి కలుషిత నీటి ద్వారా మనుషులకు సంక్రమించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వుహాన్‌కు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. వుహాన్‌లో తొలి కేసు బయటపడడంతో.. అక్కడే వైరస్ పుట్టినట్లు అందరూ అపోహ పడుతున్నారని వెల్లడించారు.
భారత్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే చాలా రోజుల పాటు కరోనావైరస్ను గుర్తించలేకపోయారని నిందలు వేశారు చైనీస్ శాస్త్రవేత్తలు.
చైనా ముందు నుంచీ ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో ఇటలీ, అమెరికా, యూరప్‌పై ఆరోపణలు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే పక్క దేశాలపై దుమ్మెత్తిస్తోంది. ఇప్పుడు ఇండియా వైపు వేలెత్తి చూపుతోంది డ్రాగన్. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవల నేపథ్యంలో.. భారత్‌పై చైనా ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయింది.