లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఒకటి కాదు..రెండు కరోనాలు! : రెండు రకాల వైరస్‌లను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు

Published

on

Chinese scientists identify two strains of the coronavirus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్‌-19’ అందరూ అనుకుంటున్నట్టుగా ఒకటి కాదా? రెండు వైరస్ లా? అనే అనుమానాలకు ఔననే సమాధానమిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనాలు జరిగి రెండు రకాల వైర్‌సలు వ్యాపిస్తున్నాయా?చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని పెకింగ్‌, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నారు. 

103 కరోనా నమూనాలను అధ్యయనం చేసిన వారు.. కొవిడ్‌-19లో ఎల్‌, ఎస్‌ అనే రెండు జాతులు ఉన్నట్టు గుర్తించారు. ‘ఎస్‌’ రకం మొదటి నుంచీ ఉన్నది కాగా.. జన్యు ఉత్పరివర్తనం కారణంగా ‘ఎల్‌’ రకం ఉద్భవించింది. ప్రమాదకరమైన ‘ఎల్‌’ రకం ఇన్నాళ్లూ ఎక్కువగా వ్యాపించిందని వారి అధ్యయనంలో తేలింది.  ఎల్ రకం దూకుడు 70 శాతం ఉంటుందనీ..ఎస్ రకం 30 శాతం ఉంటుందని తెలిపారు. 

కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో దాదాపు 70 శాతం మంది ఎల్‌ రకం వైరస్‌ బారినే పడినట్టు వారు తెలిపారు. అయితే..2020లో  దాని వ్యాప్తి తగ్గిపోయిందని, ఇప్పుడు అంతగా ప్రమాదకరంకాని ‘ఎస్‌’ రకం వైరస్‌ నెమ్మదిగా వ్యాపిస్తోందని వివరించారు. వూహాన్ నగరంలో వ్యాపించి ఎల్ రకం వల్లనే అంత తీవ్రస్థాయికి వెళ్లిందని తెలిపారు.

“కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) ఉన్న రోగుల క్లినికల్ లక్షణాల యొక్క జన్యుసంబంధమైన డేటా, ఎపిడెమియోలాజికల్ డేటా,చార్ట్ రికార్డులను మిళితం చేసి మరింత తక్షణ, సమగ్ర అధ్యయనాల అత్యవసర అవసరాన్ని ఈ పరిశోధనలు బలంగా సమర్థిస్తున్నాయని మంగళవారం (మార్చి 4,2020)ప్రచురించిన ఒక అధ్యయనంలో తెలిపారు నేషనల్ సైన్స్ రివ్యూలో, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్.

See Also | ట్నంకోసం భార్యను వేధిస్తున్న Flipkart కో ఫౌండర్..మరదలిపైనా లైంగిక వేధింపులు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *