ఇండియన్ ఆర్మీకి భ‌య‌ప‌డి ఏడ్చిన‌ చైనా జ‌వాన్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొంత‌కాలంగా లడఖ్ సరిహద్దుల్లో భార‌త్‌-చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గతనెలలో తూర్పు లడఖ్ ‌లోని ప్ర‌ధాన ప‌ర్వ‌త ప్రాంతాల‌పై భార‌త సైన్యం ఆధిప‌త్యం సాధించ‌డంతో ఆయా ప్రాంతాల్లో చైనా అద‌న‌పు బ‌ల‌గాల‌ను మెహ‌రించింది. ఈ నేప‌థ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోలో… భారత బోర్డర్ కు బ‌స్సులో వెళుతున్న చైనా జ‌వాన్లు.. మ‌న‌సులో బాధ‌ను బ‌య‌ట‌కు క‌క్క‌లేక‌, మింగ‌లేక తెగ అవ‌స్థ ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో భావోద్వేగంగా సాగే ‘గ్రీన్ ఫ్ల‌వ‌ర్స్ ఇన్ ద ఆర్మీ’ అనే మిలి‌ట‌రీ పాట‌కు గొంతు క‌లుపుతూ క‌న్నీళ్లు కార్చారు.


స‌రిహ‌ద్దులో గ‌స్తీ కాయ‌డానికి వెళ్తున్న చైనా జ‌వాన్లు భార‌త సైన్యంతో త‌ల‌ప‌డేందుకు భ‌య‌ప‌డి ఏడుస్తున్నారు అంటూ తైవాన్ మీడియా కథనాలు రాసింది. అయితే తైవాన్ కథనాలను చైనా ఖండించింది. త‌మ యువ‌ సైనికులు అప్పుడే వారి కుటుంబాల‌కు తొలిసారిగా వీడ్కోలు ప‌లికి వ‌స్తున్నందువ‌ల్లే కంట‌త‌డి పెట్టుకున్నార‌ని చైనా వివ‌ర‌ణ ఇచ్చింది. పైగా వారు పాడుతుంది చైనా మిలిట‌రీ సాంగ్ కావ‌డంతో స‌హ‌జంగానే ఉద్వేగానికి లోన‌య్యార‌ని స్ప‌ష్టం చేసింది.

Related Posts