లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అరె ఏంట్రా ఇది..! : ’బరువు‘ తగ్గించుకోవటానికి అరగంటలో 30కేజీల ఆరెంజ్​లు తినేశారు..!!

Published

on

chinese travellers eat 30 kg oranges in 30 minutes : ఆరెంజ్​ పండ్లు, పుల్ల పుల్లగా తియ్య తియ్యగా భలే గుంటాయి. సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని ఆరెంజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదిలా ఉంటే..ఓ నలుగురు వ్యక్తులు 30 నిమిషాల్లో ఏకంగా 30 కిలోల ఆరెంజ్ పండ్లను తినేశారు..! ఎందుకో తెలుసా? ‘బరువు’ తగ్గించుకోవటానికి..!! అదేంటీ ఆరెంజ్ పండ్లు ఎక్కువగా తింటే బరువు తగ్గుతారా? అనే డౌట్ వస్తుంది కదూ..కానీ ఇక్కడ తగ్గించుకునేది శరీర బరువు కాదు ‘లగేజీ బరువు’తగ్గించుకోవటానికి..!! దీంతో పాపం..వాళ్లకు లగేజీ తగ్గటం మాట పక్కన పెడితే అంత ఎక్కువగా తినటంతో నోట్లో పుళ్లు వచ్చేశాయి.

చైనా యునాన్ ప్రావిన్స్​లోని కున్మింగ్ ఎయిర్​పోర్టులో వాంగ్ అనే వ్యక్తి తన సహచరులతో కలిసి బిజినెస్ ట్రిప్ కోసం కున్మింగ్​కు వచ్చాడు. అలా వచ్చిన వాంగ్ అక్కడు నిగనిగలాడుతూ కనువిందు చేసే ఆరెంజ్ పండ్లను చూసి ముచ్చటపడ్డాడు.కొనాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాటి ధర ఎంతో అడిగాడు. 50 యువాన్లకే (ఇండియా కరెన్సీలో 563 రూపాయలు) 30 కిలోల ఆరెంజ్​లు వచ్చే సరికి ఏమాత్రం ఆలోచించకుండా కొనేశాడు.

తీరా విమానం ఎక్కే సమయంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన వారు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ 30 కిలోల పండ్లను కూడా తీసుకెళ్లాలంటే ఏకంగా 300 యువాన్లు (3,382 రూపాయలు) లగేజీ చార్జ్ చెల్లించాలని ఎయిర్ పోర్ట్ అధికారులె చెప్పారు. దీంతో వాళ్లు షాక్ అయ్యారు. సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నట్లుగా అయిపోయింది వాళ్ల పరిస్థితి. వాటిని అక్కడ వదిలేయలేరు..అలాగని కూడా పట్టుకెళ్లలేరు. దీంతో వాళ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

ఆరెంజ్​లను కొన్న ధర కంటే ఆరు రెట్ల చార్జ్ ఎక్కువగా ఉండడంతో వాంగ్​.. అతని సహచరులు ఓ నిర్ణయానికి వచ్చారు. వాటిని వేస్ట్ చేయకుండా.. చార్జ్ చెల్లించకుండా ఓ ఐడియా వేశారు. ఫ్లైట్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఎయిర్​పోర్టులోనే కూర్చుని ఆరెంజ్ లను తీనేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తినటం మొదలు పెట్టారు. అలా మొత్తం నలుగురు కలిసి కేవలం 30 నిమిషాల్లోనే (అరగంట) 30 కేజీల పండ్లు తినేశారు. కానీ పాపం తినటం అయితే తిన్నారుగానీ.. ఒక్కేసారిగా అన్ని ఆరెంజ్​లు తినేసరికి వాళ్లకు నోళ్లకు పుండ్లు అయ్యాయి.

దీంతో ఇక ఇప్పట్లో నేను ఛస్తే ఆరెంజ్ లకు తిననుగాక తిననని వాంగ్ చెప్పారు. ఎయిర్​పోర్టులోనే అంత మొత్తంలో తినడంతో అక్కడి ఉన్నవారంతా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ..బుర్రతక్కువవాళ్లా ఏంటీ..ఒక్కరే అంత లగేజ్ చార్జీలు భరించలేకపోతే..నలుగురు షేర్ చేసుకోవచ్చుకదా..అంటూ కామెంట్ చేశాడో యూజర్. మరొకరు..వాటిని అలా తినేయకపోతే అక్కడ వదిలేయొచ్చుగా..తినేసి నోటి నిండి పుండ్లు చేసుకోకపోతే..మరీ కక్కుర్తి కాకపోతే..అంటున్నారు.