లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్.. కరోనా వైరస్‌ను వూహన్‌ ల్యాబ్‌లో పుట్టించారు: చైనీస్ శాస్త్రవేత్త

Published

on

COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతుంది.
అయితే మొదటి నుంచి చైనా ఈ వైరస్‌ను సృష్టించింది అంటూ ఆరోపణలు వస్తుండగా.. ఇప్పుడు చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. చైనాలోని వూహన్‌లో కరోనా వైరస్ మానవ నిర్మితం అయ్యిందని, వూహన్ సిటీలోని ఓ ల్యాబ్‌లో దీనిని తయారుచేసినట్లుగా చైనా వైరాలజిస్ట్ వెల్లడించారు. చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబర్‌లో కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది. ఆ తరువాత ఈ ఘోరమైన వైరస్ ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి COVID-19 వైరస్ మానవ నిర్మితమైనదని మరియు చైనాలో తయారు చేయబడిందని చైనాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ కరోనా వైరస్ సృష్టించినట్లు వస్తున్న ఆరోపణలపై చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.
కరోనా వైరస్‌ను చైనా క్రియేట్ చేస్తుందని అమెరికా నిరంతరం ఆరోపిస్తోంది. అదే సమయంలో, ఐరోపాలోని చాలా దేశాలు కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ మూలానికి చైనాను నిందించాయి. కానీ ఇప్పుడు చైనాకు చెందిన ఒక మహిళా వైరాలజిస్ట్ చైనాపై మరోసారి ప్రశ్నలు సంధించడంతో దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌ మానవ నిర్మితమని ఆమె అంటున్నారు. చైనాకు చెందిన లి మెంగ్ యాన్ అనే ఓ మహిళా వైరాలజిస్ట్.. కరోనా వైరస్ మానవ నిర్మితమని చెబుతున్నారు.

చుషుల్: చైనా, ఇండియాల మధ్య యుద్ధమంటూ వస్తే…ఇక్కడే


కరోనా వైరస్ మానవ నిర్మితమని నిరూపించడానికి ఆమెకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ చెప్పారు. ఈ వైరస్ గురించి చైనా చాలా విషయాలు దాచిపెడుతోందని, ఇది చైనా మానవ నిర్మిత వైరస్ అని ఆమె అన్నారు. దీనికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను వాటిని నిరూపిస్తాను అని వైరోలాజిస్ట్ లి మెంగ్ యాన్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వుహాన్ మాంసం మార్కెట్ నుండి రాలేదని, ఇది వైరస్ ప్రకృతి ఉత్పత్తి కాదని అన్నారు. ఈ వైరస్ మాంసం మార్కెట్ నుంచి రాలేదని, ఈ ప్రమాదకరమైన వైరస్ వుహాన్ ల్యాబ్ నుండి వచ్చిందని, ఇది మానవ నిర్మితమని అన్నారు.ఈ వైరస్ యొక్క జన్యు శ్రేణి మానవ వేలి ముద్రణ లాంటిదని, దీని ఆధారంగా ఇది మానవ నిర్మిత వైరస్ అని నిరూపిస్తానని లి-మెంగ్ యాన్ చెప్పారు. ఏదైనా వైరస్‌లో హ్యూమన్ ఫింగర్ ప్రింట్ ఉండటం సరిపోతుందంటే అది మానవుల నుండే ఉద్భవించిందని అర్థం అని ఆమె అన్నారు. మీకు జీవశాస్త్రం గురించి తెలియకపోయినా లేదా మీరు చదవకపోయినా, ఈ వైరస్ మూలాన్ని దాని పరిమాణంతో గుర్తించగలుగుతారని వైరాలజిస్ట్ మెంగ్ చెప్పారు. చైనా ప్రభుత్వంపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు.
నేను చెప్పేవి అబద్దాలు అని ప్రచారం చెయ్యడానికి ప్రభుత్వం వివిధ వ్యూహాలను అనుసరిస్తోందని, తనని హత్య చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. అయినా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదని అన్నారు. కరోనా వైరస్‌ను అధ్యయనం చేసిన మొదటి కొద్దిమంది శాస్త్రవేత్తలలో ఆమె ఒకరని లి-మెంగ్ చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *