లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

జనసేనకు చిరంజీవి సపోర్టు – నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

Published

on

Chiranjeevi along with Pawan : రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి… మరోసారి ప్రజల మధ్యలోకి రానున్నారా… అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఈ విషయం వెల్లడించారు. పవన్ కల్యాణ్ వెంట త్వరలో చిరంజీవి రాబోతున్నారని… పవన్‌కు అండగా ఉంటామని మెగాస్టార్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతుకు అండగా అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతకు పెద్దఎత్తున అవకాశం ఇస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. రెండు సంవత్సరాల వరకు మాత్రమే సినిమాలు కొనసాగించాలని పవన్ కు చిరు సూచించారని తెలపడం విశేషం.

రాష్ట్రంలో నియంత పరిపాలన కొనసాగుతోందని, రైతులకు అండగా అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఏకగ్రీవాలకు జనసేన పార్టీ వ్యతిరేకమన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత..నాదెండ్ల మనోహర్..కీలకంగా ఉంటున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో నాదెండ్ల వ్యూహాత్మక పాత్ర పోషించారు. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రంగంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

గతంలో రాజకీయ పార్టీని స్థాపించిన చిరు..ప్రస్తుతం సినిమాలు చేస్తూ..బిజీగా గడుపుతున్నారు. మరోసారి..ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతారా అనే చర్చ జరుగుతోంది. లేక..సేనకు మద్దతుతోనే సరిపెడుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే…జనసేన పార్టీని స్థాపించిన ఆయన..గత ఎన్నికల్లో పోటీ చేసి ఘోరపరాజయాన్ని చవి చూశారు. పోటీ చేసిన పవన్..కూడా ఓడిపోయారు. ప్రస్తుతం పవన్ కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత..పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతారని టాక్ వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన..వ్యూహాత్మకంగా వెళుతోంది. కాపు సామాజీక వర్గానికి చెందిన కీలక నేతలు…ఇప్పటికే బీజేపీ, జనసేన పార్టీలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది.