Home » RRR కోసం చిరంజీవి, ఆమిర్ ఖాన్
Published
2 months agoon
By
sekharChiranjeevi and Aamir Khan: యంగ్ టైగర్ NTR కొమరం భీం, మెగా పవర్‌స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘#RRR- రౌద్రం రణం రుధిరం’’..లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, తారక్, చరణ్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయనున్నారట. తన వాయిస్ ఓవర్‌తో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పరిచయం చేయనున్నారు చిరు.
అలాగే హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వాయిస్ ఇవ్వనున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ స్టార్స్‌ను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అగ్రహీరోల చేత వాయిస్ ఓవర్ చెప్పించనున్నారు.