లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘క్రాక్’ బాగా తీశావ్.. దర్శకుణ్ణి అభినందించిన చిరు..

Published

on

Chiranjeevi Appreciates: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది.. జనవరి 9న సాయంత్రం షోల నుండి థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ‘క్రాక్’ మంచి టాక్‌తో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ అయినప్పటికీ చక్కని కలెక్షన్లు రాబట్టింది.

Krack

ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు రాసుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన విధానంతో పాటు మాస్ మహారాజా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, రవితేజ భార్యగా ట్విస్ట్‌తో కూడిన శృతి హాసన్ క్యారెక్టర్, కటారి కృష్ణగా సముద్రఖని, జయమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్‌ల నటన, ఫైట్స్, డైలాగ్స్. థమన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.

Krack

తాజాగా ‘క్రాక్’ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు గోపిచంద్ మలినేనిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని అభినందించారు. ‘తాను ఒంగోలులో చదువుకున్నప్పటికీ ఇలాంటి వాస్తవ సంఘటనల గురించి వినలేదు కానీ సినిమా చూస్తుంటే క్యారెక్టర్లు కళ్లముందు కదలాడుతున్నాయి.. కథ, పాత్రలు, టేకింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరైన మాస్ హిట్ ఇచ్చావ్..’ అంటూ మెగాస్టార్ తనను అభినందించారంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు గోపిచంద్ మలినేని.