మెగా మనసు.. పేదలకు ఉచితంగా ప్లాస్మా వితరణ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Chiranjeevi freely Donates Plasma: లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికుల క్షేమం కోసం ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థ ద్వారా సినీ కారిక్ముల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.


చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మందికి సాయమందిస్తూ అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తన అభిమానుల సహకారంతో మరో సాయం అందించడానికి సిద్ధమయ్యారు.


చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగమైన చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా నిస్సహాయులైన పేదలకు ఉచితంగా ప్లాస్మాను అందించనున్నట్లు మెగాభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు దారులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోగలరని మెగాభిమానులు ప్రకటిస్తూ లేఖ విడుదల చేశారు.

Related Posts