లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘చూసీ చూడంగానే’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘చూసీ చూడంగానే’ జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్..

Published

on

Choosi Choodangaane Platinum Disc Function

బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘చూసీ చూడంగానే’ జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్..

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న రాజ్ కందుకూరి నిర్మాత‌గా ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’.. శేష సింధు ద‌ర్శకురాలు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా జనవరి 31న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌తో అన్ని మాధ్యమాల్లో కలిపి 25 మిలియన్స్ వ్యూస్ సాధించిన సందర్భంగా ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఈవెంట్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వ‌హించింది చిత్ర యూనిట్..

Image

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ : “జనవరి 31న సురేష్ ప్రొడక్షన్ ద్వారా `చూసి చూడంగానే` విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. అలాగే గోపి సుందర్ సంగీత సారథ్యంలో మధుర ఆడియో ద్వారా విడుదలైన అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం అన్ని మాధ్యమాల్లో కలిపి 25 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా నా స్నేహితుడు మధుర శ్రీధర్‌కి, రచయితలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ ఒక అందమైన ప్రేమకథ. ఔట్‌పుట్ చాలా బాలా వ‌చ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మా అబ్బాయి శివ కందుకూరికి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Read Also : ఏప్రిల్ 2న ‘ఉప్పెన’

Image
మధుర శ్రీధర్ మాట్లాడుతూ : “ఒక చిన్న సినిమా విడుదలకి ముందే అన్ని పాటలు పెద్ద హిట్ అవ్వడం నిజంగా అదృష్టం. శివ కందుకూరి డెబ్యూ మూవీ అంటే మా అందరికి సెలబ్రేషన్ మూమెంట్. జనవరి 31 న విడుదలవుతున్న ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని, ఈ 2020 మా శివ కందుకూరిది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ : “మా మూవీ సాంగ్స్ ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో కలిపి 25 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ సాధించాయి. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ గారికి, గోపి సుందర్ గారికి మరియు మా రచయితలకు నా ధన్యవాదాలు. న్యాచురల్ స్క్రిప్ట్ ఇది. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ద్వారా నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నాన్న రాజ్ కందుకూరి గారికి, మా దర్శకురాలు శేష సింధు రావు గారికి స్పెషల్ థాంక్స్” అన్నారు.

Image
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ : ‘‘చాలా కాలం తర్వాత నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన ఈవెంట్ ఇది. సున్నితమైన భావోద్వేగాలతో అద్భుతంగా చిత్రీకరించారు దర్శకురాలు శేష సింధు గారు. మంచి సంగీతం కుదిరింది. సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ : “ఈ స్క్రిప్ట్ ఓకే అయినప్పటినుండి అన్ని కరెక్ట్‌గా కుదురుతున్నాయి. అందుకే పాటలు ఇంత పెద్ద విజయాన్ని సాధించాయి. బేసిక్‌గా నేను మ్యూజిక్ లవర్‌ని. అందుకే నా సినిమాలో పాటలు బాగుండాలని టాప్ లిరిసిస్ట్‌లందరితో పాట‌లు రాయించడం జరిగింది. తొలి చిత్రం అయినా అందరూ ఎంతో సపోర్ట్ చేసి మంచి పాటలను అందించారు. గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే రేపు థియేటర్‌లో ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. ఒక మంచి లవ్ స్టోరీ. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. శివ నేను ఊహించిన క్యారెక్టర్‌కి యాప్ట్ అనేలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. జనవరి 31న మూవీ విడుదలవుతుంది. రెండు గంటల పాటు తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు” అన్నారు.

Image
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ : “పాటలకి 25 మిలియన్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్” అన్నారు.
హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ : “చూసి చూడంగానే మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్, డైరెక్టర్ శేష సింధు గారు రాసుకున్న పాయింట్‌ను అందంగా స్క్రీన్‌పై చూపించారు’’ అన్నారు.
                                                   
                                                               

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *