లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

లైఫ్‌లో ఏం ప్లాన్ చేయకూడదు – ఏం జరిగినా దాన్ని ఎంజాయ్ చేయాలి!

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంయుక్తంగా ‘చూసీ చూడంగానే’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

Published

on

Choosi Choodangaane -Theatrical Trailer

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంయుక్తంగా ‘చూసీ చూడంగానే’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి.. ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ.. ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్లో ‘చూసీ చూడంగానే’ అనే సినిమా నిర్మిస్తున్నారాయన. రాజ్ కందుకూరి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అసోషియేషన్లో రిలీజవనుంది.

తమిళనాట ‘96’ ‘బిగిల్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. మాళవిక సతీషన్ కీలక పాత్రలో కినిపించనుంది. క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వంటి దర్శకుల దగ్గర పనిచేసిన శేష సింధు దర్శకురాలిగా పరిచయమవుతుంది. తాజాగా ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంయుక్తంగా ‘చూసీ చూడంగానే’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

సినిమాపై అంచనాలు పెంచేలా ఉందీ ట్రైలర్. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంట‌ల్ మ‌దిలో’ కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ చిత్రం విడుదల కాబొతోంది.

 


విడుదల -సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌
డైలాగ్స్‌: ప‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌
ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజాల‌

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *