మధ్యప్రదేశ్ లో తొలిసారి “కౌ కేబినెట్” భేటీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

first meeting of ‘gau cabinet’ in MP మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ, అటవీ, పంచాయత్, గ్రామీణాభివృద్ది, హోమ్, రైతు సంక్షేమ శాఖలు ఇందులో భాగంగా ఉంటాయని సీఎం చౌహాన్ చెప్పారు. కేవలం గోవుల పరిరక్షణ కోసం ఓ కేబినెట్ ని ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు.కాగా, ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కౌ కేబినెట్’​ తొలిసారి సమావేశమైంది. సీఎం శివారాజ్​సింగ్​ నేతృత్వంలో వర్చువల్ గా జరిగిన ఈ భేటీలో గోసంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ గోపాష్టమి పండుగ సందర్భంగా భోపాల్ లోని తన నివాసంలో వర్చువల్ గా నిర్వహించిన కౌ కేబినెట్ లో భేటీలో పాల్గొన్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం.సమావేశానికి హాజరవడానికి ముందు రాజధాని భోపాల్​ లోని తన నివాసం దగ్గర ‘గోపాష్టమి’ వేడుకలు జరుపుకున్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఓ లేగదూడకు పూజలు చేసి, ముద్దాడారు. కౌ కేభినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం చౌహాన్ మాట్లాడుతూ…గోవుల సంరక్షణ మరియు ప్రమోషన్ కోసం పశువులకు సంబంధించిన మంత్రిత్వశాఖల డిపార్ట్మెంట్ లు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి సంయుక్తంగా మంత్రి పరిషద్ సమితిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

కేవలం పశు సంవర్థకశాఖ మాత్రమే ఈ ఇష్యూని హ్యాండిల్ చేయలేదని సీఎం చెప్పారు.కాగా,ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్‌లలోని 1.8 లక్షల ఆవుల దాణా కోసం మధ్యప్రదేశ్ సర్కార్ 11 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :