ఐపీఎల్‌లో ఈ రికార్డు అజరామరం.. ఎప్పటికీ అంతం కాకపోవచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఒక బౌలర్ ఒక ఓవర్లో 37 పరుగులు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కానీ.. ఐపిఎల్‌లో ఇది సాధ్యం అయ్యింది. ఈ రికార్డు ఎప్పటికీ అంతం కానిది కావచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం.
ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కలిగి ఉంది. 2013లో 263/5 పరుగులు చేసిన ఆర్‌సిబి ఈ రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంటే ఒకే ఓవర్‌లో 37 పరుగులు అంటే దాదాపు అసాధ్యమే.. ఎందుకంటే ఓవర్‌కు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే వస్తాయి. కానీ ఆ బౌలర్ వేసిన నోబాల్‌ను భారీ షాట్ ఆడడంతో ఈ వరల్డ్ రికార్డు నమోదైంది.

ఈ యూనిక్ రికార్డును నమోదు చేసింది యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్. ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నప్పుడే గేల్ ఈ రికార్డ్ క్రయేట్ చేశాడు. అన్ని పరుగులు సమర్పించుకుందది కేరళ క్రికెటర్ ప్రశాంత్ పరమేశ్వరణ్.ఐపీఎల్ 2011వ సీజన్‌లో భాగంగా కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వరెస్ట్ రికార్డు నమోదైంది. ప్రశాంత్ పరమేశ్వరణ్ వేసిన మూడో ఓవర్‌లో గేల్ బంతుల్ని స్టేడియం దాటించాడు. 6, 6+నోబాల్, 4, 4, 6, 6, 4తో మొత్తం 37 పరుగులు రాబట్టాడు గేల్. పరమేశ్వరణ్ వేసిన నోబాల్‌‌తో కలిసి మొత్తం 7 బంతులు ఆడిన గేల్.. ఏడింటిని బౌండరీకి తరలించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఇది చెరిగిపోని రికార్డుగా మిగిలిపోవచ్చు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కొచ్చి టస్కర్స్ కేరళ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా(23), మెకల్లమ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం చేజింగ్‌కు దిగిన ఆర్‌సీబీ గేల్ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు దిల్షాన్(52 నాటౌట్), విరాట్ కోహ్లీ(27 నాటౌట్) రాణించడంతో 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 128 పరుగులు చేసి 9 వికెట్ల ఘన విజయం అందుకుంది.


Related Posts