Class 4 Student Letters to Cm Jagan

మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం గొడవలు జరుగుతున్న క్రమంలో ఓ చిన్నారి గొడవలు గురించి వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన కోడూరి పుష్ప అనే నాల్గవ తరగతి చదివే చిన్నారి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్ధేశిస్తూ.. తమ ప్రాంతంలో జరుగుతున్న గొడవల కారణంగా చదువుకోలేకపోతున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబంను నాలుగు నెలలుగా బహిష్కరించారని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీఎంను కోరింది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు నమస్కరించి వ్రాయునది ఏమనగా..
    “అన్నా.. నా పేరు కోడూరి పుష్ప. నాకు ఒక చెల్లెలు. పేరు గాయత్రి. ఒక తమ్ముడు. పేరు హేమంత్. మా అమ్మనాన్నల పేర్లు కోడూరి రాజు, జానకీ, మా తాత నానమ్మల పేర్లు కోడూరి వెంకటేశ్వర్లు, మంగమ్మ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో మేము ఉంటున్నాము. ఈ నెల 4వ తేదీ నుంచి మా స్కూల్లో మాతో పాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మా ముగ్గురితో మాట్లాడట్లేదు. ఎవరైనా మాతో మాట్లాడితే రూ. 10వేలు ఫైన్ వేస్తారని చెబుతున్నారు. మమ్మల్ని ఊర్లో వెలివేశారంట. ఇప్పుడు ఎవరూ స్కూలుకు రావట్లేదు. మాతో మాట్లాడట్లేదు. మాతో ఆడట్లేదు. మాకు చదువుకోవాలని ఉంది. మాకు ఆడుకోవాలని ఉంది. మా నాన్నను, మా తాతను చంపేస్తారని మా స్నేహితులు చెబుతున్నారు. మాకు చాలా భయంగా ఉంది.” అంటూ చిన్నారి పుష్ప లేఖ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.

అయితే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ అనుచరులచే సామాజిక బహిష్కరణకు గురై వారి దాడులకు వేధింపులకు నిత్యం గురవుతూ కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నాల్గవ తరగతి చదువుతున్న చిన్నారి కోడూరి పుష్ప తమ కుటుంబ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది.

Related Posts