లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వారి ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేసిన సీఎం జగన్, MSMEలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహకం

Published

on

ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం(జూన్ 29,2020) సీఎం జగన్ ఎంఎస్ఎంఈల ఖాతాల్లో రూ.455 కోట్లు జమ చేశారు. మొత్తం 97వేల 428 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చారు. మొదటి విడతలో భాగంగా మే 22న రూ.450 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, తక్కువ వడ్డీకే చిన్న పరిశ్రమలకు 2లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలిస్తామన్నారు. ఈ రుణసాయానికి 6 నెలల మారిటోరియం కల్పిస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెల్లో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేశ ఆర్ధిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు కీలక పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి మొదటి విడతగా కొంత మొత్తాన్ని రిలీజ్ చేసింది. ఈరోజు రెండో విడతగా మరికొంత మొత్తాన్ని ఎంఎస్ఎంఈ లకు అందించింది ఏపీ ప్రభుత్వం.

రూ.1,110 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీ:
కరోనా విపత్తు వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద ఊరట కల్పించారు. వీటికి రూ.1,110 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రారంభించారు. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాల్లో తొలి విడతగా రూ.450 కోట్లను సీఎం జగన్‌ మే నెలలో విడుదల చేశారు. రెండో విడతగా మిగిలిన బకాయిలను ఇవాళ రిలీజ్ చేశారు. ఎంఎస్‌ఎంఈలు 10 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయని.. నిరుద్యోగం పెరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రద్దుచేశామని, తక్కువ వడ్డీపై వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.200 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుచేశామన్నారు. అంతేకాక.. దాదాపు రూ.10 లక్షల వరకు రుణాలను 6–8 శాతం తక్కువ వడ్డీకే ఇస్తామని, ఈ రుణాలపై ఆరు నెలల మారిటోరియమ్‌ ఉంటుందని కూడా సీఎం వివరించారు. దీంతో.. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడం, విద్యుత్‌ ఛార్జీల రద్దు నిర్ణయంపై ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలన్న సీఎం జగన్:
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు దాదాపు 98 వేలు ఉంటే, వాటిలో 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. వాటిని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను అధిగమించలేం. ప్రభుత్వం తోడు ఉంటే తప్ప అవి మనుగడ కొనసాగించలేవు. అందుకే వీటిపై శ్రద్ధ పెట్టమని కలెక్టర్లను కోరుతున్నా. లాక్‌డౌన్‌ వల్ల ఈ రంగం కుదేలైంది. దీనిని నిలబెట్టుకోకపోతే, సమస్యలు పెరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగానికి చెందిన ప్రోత్సాహకాలను పట్టించుకోలేదు. చిన్నచిన్న వారితో పరిశ్రమలు పెట్టించి, వారికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయకపోవడంతో వారు చితికిపోయారు.

Read:కర్నూలులో అమానుషం, గర్భిణి మృతదేహాన్ని అడవుల్లో చెట్టుకి కట్టేశారు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *