Home » మా మేనిఫెస్టోలో ఆ మాటే లేదు : పిచ్చాసుపత్రికి పంపాల్సిందే
Published
1 year agoon
By
veegamteamఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రెండో రోజు(డిసెంబర్ 10,2019) సమావేశాల్లో సన్నబియ్యం సరఫరా అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో రాష్ట్రమంతా తిరిగిన జగన్.. అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని చెప్పారని.. ఇప్పుడేమో మేలైన బియ్యం అంటూ మాట తప్పారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. నాడు సన్నబియ్యం అన్న ప్రభుత్వం.. ఇప్పుడేమో నాణ్యమైన బియ్యం అంటూ.. ప్రజలు మోసం చేసిందన్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు మాటతప్పిందో చెప్పాలని అచ్చెన్న నిలదీశారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం:
దీనిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. తమ మేనిఫెస్టోలో సన్నబియ్యం అనే మాటే లేదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఫలానా తరహా బియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పామన్నారు. కావాలంటే కళ్లద్దాలు పెట్టుకుని తమ మేనిఫెస్టోని చదువుకోవాలని ప్రతిపక్షంపై ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన దానికంటే మేలైన బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఉందన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
బియ్యం ఖర్చు కన్నా రవాణ ఖర్చే ఎక్కువ:
ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు మేలైన బియ్యం ఇస్తామంటూ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు కోటి 20లక్షల కిలోల బియ్యం అవసరం అవుతుందన్నారు. ఆ బియ్యానికి రూపాయి చొప్పున వేసుకున్నా రూ.కోటి 20లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అయితే ట్రాన్స్ పోర్టుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.