లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

నేనున్నా..మాట తప్పను : ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా – సీఎం జగన్

Published

on

JAGAN

నేనున్నా..మాట తప్పను, ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా ? మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదన్నారు సీఎం జగన్. అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు, పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో..దానిని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు వెల్లడించారు.

2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 8,71,302 పొదుపు సంఘాల్లో వున్న 87,74,674 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2019 ఏప్రిల్‌ 11వ తేదీ వరకు వారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లుగా ఉందని, పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే ఈ అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామన్నారు.తొలి విడతగా ఈ రోజు రూ.6,792.20 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలకు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎపి మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్నట్లు, ఒక మంచి అన్నగా, తమ్ముడిగా ఈ డబ్బును మీ ఖాతాలోనే జమ చేస్తున్నామన్నారు.
దీనిని పెట్టుబడిగా మార్చుకుని, బ్యాంకుల ద్వారా చిన్నచిన్న రుణాలు తీసుకోవాలన్నారు.

పాడిపశువులు, వ్యాపారాలు, గొర్రెలు, మేకల కొనుగోలు చేయాలనుకుంటే, దానికి కూడా బ్యాంకులు, దిగ్గజ సంస్థలైన రిలయన్స్, ఐటిసి, అమూల్ తదితర కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నట్లు, వ్యాపారులు చేసుకునేందుకు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని అనుకుంటే..ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ, మార్కెటింగ్ వంటి వసతులను వినియోగించుకోవాలని లబ్దిదారులకు సూచించారాయన.
ఇంకా ఏమన్నారంటే…
– ఇప్పటికే దీనిని వైయస్‌ఆర్‌ చేయూత పథకానికి వర్తింపచేశాం.
– అలాగే మీరు కూడా చేసుకోవాలని అనుకుంటే అందుకు ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం.
– మెప్మా, సెర్ఫ్ అధికారులను సంప్రదించినా… 1902 నెంబర్‌కు ఫోన్ చేసినా మీకు సహాయం అందిస్తారు
– వాలంటీర్లను సంప్రదించినా కూడా కంపెనీలు, బ్యాంకుల ద్వారా మీకు చేలు జరిగేలా చూస్తారు
– అక్కచెల్లెమ్మలకు పరిస్థితులు మెరుగవ్వాలని…– విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా…
– మహిళా సాధికారత కోసం దేశంలో ఏక్కడా లేని విధంగా …
– గత పదిహేను నెలలుగా అడుగులు వేస్తున్నాం.
– అమ్మ కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు అందరికీ సంక్షేమం అందాలి.
– అందరికీ మంచి జరగాలని వివిధ పథకాలను పదిహేను నెలల కాలంలో తీసుకువచ్చాం.– గర్భిణీలు, బాలింతలకు బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి…
– ఆరేళ్ళ వయస్సు వచ్చే వరకు బిడ్డలు, అమ్మలకు సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం.
– వచ్చే తరానికి అవసరమైన ఇంగ్లీష్ మీడియంను అంగన్ వాడీ కేంద్రాలను పిపి-1, పిపి-2లుగా మారుస్తున్నాం.– ఆరేళ్ళ పిల్లల నుంచి ఇంటర్ మీడియట్ వరకు చదువుకునే పిల్లలకు పెద్దింటివారు చదివిస్తున్న ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెస్తున్నాం.
– వారు కూడా డాక్టర్లు, లాయర్లుగా రాణించాలని అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తెచ్చాం.
– ఏటా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు జమ చేస్తున్నాం.దీనివల్ల 82 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోందన్నారు సీఎం జగన్. డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన సున్నావడ్డీని గత ప్రభుత్వాలు ఎగరకొట్టారనే విషయాన్ని గుర్తు చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకం కింద రూ.1400 కోట్లు నేరుగా వారి ఖాతాలకు జమ చేశామన్నారు.

ysr asara scheme ప్రారంభం..అకౌంట్లో డబ్బులు చెక్ చేసుకోండి


అక్కా చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేపట్టినట్లు, 45-60 సంవత్సరాల మధ్య వయస్సులోని అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా ఊరిలో ఒకరిద్దరికి సంక్షేమ పథకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే పరిస్థితి ఉండకూడదని భావిస్తున్నట్లు, గతంలో మాదిరిగా రాజకీయ పలుకుబడి, లంచాలు ఇస్తేనే మేలు జరిగే పరిస్థితి ఉండకూడదన్నారు.– అందుకే పేదరికంలో వున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్ చేయూత ద్వారా 22 లక్షల మందికి నాలుగేళ్ళలో రూ.75వేలు అందిస్తున్నాం.
– ప్రముఖ కంపెనీల మార్గదర్శకంలో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాం.– వారు వ్యాపారంలో నష్టపోకుండా వుండేలా… వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబెడుతూ…
– మహిళలను లక్షాధికారులను చేసే కార్యక్రమం చేపట్టాం.
– దాదాపుగా 22 లక్షల అక్కచెల్లెమ్మలకు సుమారు రూ.4600 కోట్లు వారి ఖాతాలకు జమ చేశాం.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *