లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

2022 నాటికి పోలవరం పూర్తి – సీఎం జగన్

Published

on

Somasila 2nd Phase Works : 2022 ఖరీఫ్ కు నీరు వచ్చే విధంగా..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి..జాతికి అంకింతం చేస్తామన్నారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించి నీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఎక్కడా ఉండదన్నారు. మూడు రాజధానులతో పాటు మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులకు సాగు, తాగు నీరందించేందుకు రూ. 40 వేల కోట్లతో రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు.ప్రభుత్వానికి ఆదా చేసి..పనులు మొదలు పెట్టే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండో దశ పనులకు 2020, నవంబర్ 09వ తేదీ సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…


జల సిరులు : సోమశిల రెండో దశకు శ్రీకారం


సోమశిల పనులకు సంబంధించిన విషయంలో గతంలో రూ. 527 కోట్లు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత..రూ. 459 కోట్లకే పనులు జరుగుతున్నాయన్నారు. ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడిందో ఇదే ఉదాహరణ అన్నారు. ప్రతి వర్క్ లో రివర్స్ టెండరింగ్ చేయిస్తున్నట్లు తలిపారు. రూ. 68 కోట్లు మిగిలించి..పనులు స్టార్ట్ చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన మళ్లీ…ఎన్నికలు వెళ్లే లోపు..పూర్తి చేసి..రెండు నియోజకవర్గాలకు మంచి జరిగే విధంగా చేస్తామన్నారు.ఇదే నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులను జనవరిలో పూర్తి చేసి అంకితం చేస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన జరుగుతుంటే..అధికారంలోకి వచ్చిన తర్వాత..యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామన్నారు.అదే మాదిరిగా.సోమశిల కండలేరు ప్రాజెక్టు డబ్లింగ్ వర్క్ విషయంలో 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచుతూ..రూ. 918 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నామన్నారు. సోమశిల రాళ్లపాడు డబ్లింగ్ వర్క్ 720 క్యూసెక్కుల నుంచి 1440 క్యూసెక్కులకు పెంచుతూ రూ. 632 కోట్లతో..ఈ రెండు ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నామన్నారు.2020-21 సంవత్సరానికి ఆరు ప్రాదాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్ 1, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీతో పాటు మరొక ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు.‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాకారం చేసేలా రూ. 15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులో మొదటి దశ (రూ. 3500 కోట్లు)కు త్వరలోనే టెండర్లు.
వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు రూపకల్పన.కృష్ణా నది దిగువన రెండు బ్యారేజీలు, పైన ఒక బ్యారేజీ నిర్మాణం, చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్టు పనులు వేగవంతం.
నీటి విలువ, రైతులు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం, అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం ’ అన్నారు సీఎం జగన్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *