మున్సిపాలటీల ఆదాయాన్ని స్థానికంగానే ఖర్చు చేయాలి : సీఎం జగన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలటీలకు వచ్చే ఆదాయాన్ని స్థానికంగానే ఖర్చు చేయాలని జగన్ సూచించారు.ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడొద్దుని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలన్నారు.

మున్సిపల్ ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు.మున్సిపాలిటీల్లో శానిటేషన్ పక్కాగా ఉండాలన్నారు. వాటర్, సీవరేజ్ కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు.పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ వద్దని సీఎం జగన్ సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

Related Posts