Uncategorized
సీఎం జగన్ ఆదేశం : అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల
Home » సీఎం జగన్ ఆదేశం : అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల
Published
1 year agoon
By
veegamteamఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను చూసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకి సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కోడెల ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ గా చేశారు. సీనియర్ రాజకీయ నేత. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా విధులు నిర్వహించారు. దీంతో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తి స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ కి సమాచారం చేరింది.
హైదరాబాద్ నుంచి గుంటూరుకి కోడెల భౌతికకాయాన్ని తీసుకెళ్తున్నారు. గుంటూరు టీడీపీ ఆఫీస్ లో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 4 గంటల తర్వాత సత్తెనపల్లికి తీసుకెళ్తారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. బుధవారం(సెప్టెంబర్ 18,2019) ఉదయం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.