లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

చెక్ చేసుకోండి, రైతుల ఖాతాల్లోకి వెయ్యి కోట్లు జమ చేసిన సీఎం జగన్

Published

on

ysr rythu bharosa: రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన నిధులు ఇవాళ(అక్టోబర్ 27,2020) రైతులకు అందాయి. 50 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక వేయి 115 కోట్లు జమ చేశారు సీఎం జగన్‌. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం జగన్. రబీ సీజన్‌లో భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకూ పెట్టుబడి సాయం అందించారు.
రైతు భరోసా పథకం కింద ఏటా 13 వేల 500 చొప్పున ఐదేళ్లలో 67 వేల 500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది ఏపీ ప్రభుత్వం. తొలి విడతగా ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో మే నెలలో పెట్టుబడి సాయం చేసిన ప్రభుత్వం, రబీ సీజన్‌లో రెండో విడత సాయం మంగళవారం అందించింది.

ysr bheema : బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం, పథకం ప్రయోజనాలు
50 లక్షల 50 వేల మందికి రైతు భరోసా:
రైతులకు పెట్టుబడి సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. 50లక్షల మంది రైతులకు ఏటా రూ.13వేల 500 రైతు భరోసా అందిస్తున్నామన్నారు. గత ఏడాది రూ.6వేల 173 కోట్లు రైతు భరోసా కింద అందించామన్నారు. ఈ ఏడాది 50 లక్షల 50 వేల మందికి రైతు భరోసా అందిస్తున్నామన్నారు. ఎక్కడా వివక్ష, అవినీతి లేకుండా కుల మతాలకు అతీతంగా సాయం అందించినట్టు సీఎం జగన్ తెలిపారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకంతో మెరుగైన ఆహార భద్రత, మెరుగైన ఉపాధి లభిస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంని నమ్మిన ప్రభుత్వం ఇది అని జగన్ అన్నారు. కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ కంటే ఎక్కువే చేస్తున్నాం:
ఎన్నికల్లో ఇచ్చిన హామీ కంటే ఎక్కువే చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 50శాతం మంది రైతులకు 1.25 ఎకరాల్లోపు భూమి మాత్రమే ఉందని సీఎం జగన్ అన్నారు. ఈ 50శాతం మందికి 80శాతం ఖర్చును పెట్టుబడి సాయంగా అందిస్తున్నామన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా సాయం అందిస్తున్నామన్నారు సీఎం జగన్. 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్లు అందిస్తున్నామన్నారు. అక్టోబర్ లో పంటలు నష్టపోయిన రైతులకు నవంబర్ లోపే నష్టపరిహారం ఇస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *