లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు – సీఎం జగన్ ఫైర్

Published

on

CM Jagan Serious Comments : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే మంచిపనులు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పనులు చూడలేక కడుపుమంటతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు జగన్. రథాలను ఎవరు తగలబెడుతున్నారు, రథయాత్రలు ఎందుకు చేయబోతున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం జగన్.

ఏ పథకం చేపట్టినా ఆ కార్యక్రమానికి అడ్డు తగిలేలా గుడులు, గోపురాలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మవారి గుడిలో క్షుద్రపూజలు చేసిన వారు ఇప్పుడు ఇప్పుడు కొత్త వేషం కడుతున్నారని మండిపడ్డారు సీఎం. ప్రజలు చస్తే ఎంత అన్నట్లు బాబుగారి కోవర్టులు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్.
ఇన్ని చేస్తున్నాం కాబట్టే..ప్రతిపక్షాలకు చోటు లేకుండా పోతుందనే ఉద్దేశ్యంతో ఇలాంటి నీచాలకు దిగుతున్నారని విమర్శించారు. ధ్వంసమైన విగ్రహాలను చూడటానికి వాళ్లు ఎందుకు వెళుతున్నారో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం చేపట్టే ఏ ప్రోగ్రామైనా…అందుకు ముందుగా, లేదా తర్వాత..గుళ్లు, గోపురాలను చీకట్లో వెళ్లి టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి రాజకీయ వ్యవస్థతో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కు భయపడి ప్రతిపక్ష నాయకుడు, ఆయన కొడుకు ఇంట్లోనే దాక్కున్నారని ఎద్దేవా చేశారాయన. ప్రతి పేద ఇంటికి, పేదింటి పిల్లలకు వారి తల్లిదండ్రులకు మంచి చేయాలనే సంకల్పానికి అడ్డు తగులుతున్నారని తెలిపారు. వాళ్లకు ప్రజలకు మంచి చేసే చరిత్ర లేదని, మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని దెబ్బ కొడుతున్న వారిని గమనించాలన్నారు సీఎం జగన్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *