Home » మీరు బడికి వెళ్లలేదా..అయితే..ఫోన్ కు మెసేజ్ వెళుతుంది – సీఎం జగన్
Published
2 weeks agoon
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రతొక్క విద్యార్థి చదువుకొనే విధంగా తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకొందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు – నేడు కార్యక్రమం కింద ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చడం జరిగిందన్నారు.
బడికి వచ్చే వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ల నిర్వాహణ కోసం అమ్మఒడిలో ఇచ్చే రూ. 15 వేల రూపాయల్లో రూ. 1000 టాయిలెట్ ఫండ్ కింద మినహాయిస్తామన్నారు. చదువుల మీద..గత 19 నెలల్లో రూ. 24 వేల కోట్లకు పైగా..ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. టాయిలెట్ సరిగ్గా నిర్వాహణ చేయకపోతే..గ్రామ సచివాలయంలో కానీ..టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ఫిర్యాదు చేస్తే..వెంటనే సీఎం కార్యాలయం రంగంలోకి దిగుతుందన్నారు.
– 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ.
– ప్రభుత్వ పాఠశాలల్లో 84 లక్షలకు విద్యార్థుల సంఖ్య పెరిగింది.
– ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామ రక్ష.
– పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతో అమ్మ ఒడి.
– పిల్లలను మేనమామ జగన్ చూసుకుంటారన్న నమ్మకం తల్లులకు కలిగింది.
– విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు.