cm jagan on telugu subjet

సీఎం జగన్ కీలక నిర్ణయం : తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తామన్నారు. తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ కు మార్చడంపై జగన్ స్పందించారు.

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేస్తామన్నారు. తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ కు మార్చడంపై జగన్ స్పందించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదన్నారు. పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పారు. 

గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జీవో కూడా జారీ అయ్యింది. కాగా దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు భాషకి అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇంగ్లీష్ కారణంగా తెలుగు భాష కనుమరుగు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విమర్శలపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, పవన్, వెంకయ్య నాయుడు..  ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడిన సీఎం జగన్.. మరి వాళ్ల పిల్లలు ఏ స్కూళ్లలో చదివారని ప్రశ్నించారు. ఇప్పుడు వారి మనవళ్లు ఏ స్కూల్స్ లో చదువుతున్నారో చెప్పాలన్నారు. ఇక పవన్ కల్యాణ్ తన ముగ్గురి భార్యల ఐదుగురి పిల్లల్ని ఏ స్కూల్ లో చదివిస్తున్నారని నిలదీశారు సీఎం జగన్. 

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని సీఎం అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివితేనే పిల్లలు పోటీ ప్రపంచంలో గెలవగలరని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని వివరించారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇస్తామన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్బంగా విజయవాడలో జాతీయ విద్య, మైనార్టీ దినో్త్సవం నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రతిభావంతులకు ఆజాద్ విద్యా పురస్కారాలు అందజేశారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది, సామినేని ఉదయభాను అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Related Posts