లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

Tirumala Tirupathi : తిరుమలకు సీఎం జగన్

Published

on

Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్‌… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్‌ చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల శ్రీ పద్మావతి అతిథిగృహానికి వెళ్తారు. సాయంత్రం 5.30కు అన్నమయ్య భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.15కు బేడి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరకు చేరుకోనున్న జగన్‌… రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరుడి గరుడ సేవలో జగన్‌ పాల్గొంటారు.ఏపీ సీఎం జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా.. తిరుపతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జగన్‌ పర్యటన నేపథ్యంలో.. టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.జగన్‌ పర్యటన సాఫీగా సాగేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా… రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. జగన్‌ తిరుమలకు వచ్చి.. ఆయన తిరుగుపయనం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని… మోహినీ అవతారంలో ఊరేగించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు ఈ సేవ కొనసాగనుంది.మరోవైపు… బుధవారం రాత్రి అతి ముఖ్యమైన గరుడ వాహన సేవ జరగనుంది. రాత్రి 7గంటల నంచి 8.30వరకు జరిగే ఈ గరుడ సేవను… కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలోనే నిర్వహించనున్నారు. శ్రీవారి గరుడ సేవలో…. కర్నాటక సీఎం యడియూరప్ప పాల్గొననున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *