రెవెన్యూ డిపార్ట్ మెంట్ యథాతథంగా అమలు: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది.అవినీతిని రూపు మాపేందుకు పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలతో ముందుకెళుతోంది.దీంట్లో భాగంగానే VRO వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే సీఎం కేసీఆర్ ఏమాత్రం వెనకడుగు వేయటంలేదు.


కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో జరగుతున్న చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాల‌ని కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. కేవ‌లం వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్నాం. దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్ య‌థాత‌థంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.


వీఆర్‌వో వ్య‌వ‌స్థ అవినీతికి..అరాచకాల‌ వ్యవస్థగా మారిందనీ..పలు అరాచకాలకు పాల్పడుతోందని దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు.. అందుకే వీఆర్వో వ్యవస్థను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు. ఇక రెవెన్యూ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే..అన్ని రికార్డులు ఉంటాయి. స‌ర్వే సెటిల్‌మెంట్ కూడా ఉంటుంద‌న్నారు. దీంతో వారు అవినీతికి పాల్పడితే తెలిసిపోతుంది. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటాం దీంతో ఎవ‌రూ కూడా ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.


ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అసైన్డ్ భూముల గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ప్ర‌జా అవ‌స‌రాల‌కు మాత్ర‌మే అసైన్డ్ భూముల‌ను తీసుకుంటున్నామనీ..ఒక సెంటు భూమి కూడా అదనంగా తీసుకోవటంలేదని తెలిపారు. గతంలో పాలించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం లాగా.. అసైన్డ్‌ భూముల‌ను ఇష్టారాజ్యంగా తీసుకోవ‌డం లేదని ఈ విషయాన్ని గమనించాలని స్పష్టంచేశారు కేసీఆర్. కేవ‌లం ప్రాజెక్టులు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల అవసరానికి మాత్రమే అసైన్డ్ భూముల్ని ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ద‌ని సీఎం తెలిపారు.

Related Posts