లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

వార్ వన్ సైడే, గెలుపు మాదే, మెజారిటీ ఎంతో తేలాలి.. దుబ్బాక ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Published

on

dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్‌సైడేనా.. గ్రౌండ్ క్లియర్‌గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్.

ఇప్పటికే టీఆర్ఎస్ విజయం ఖాయం:
ప్రస్తుతం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌దే ఘన విజయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసలీ ఉప ఎన్నిక తమకు లెక్కే కాదన్నారాయన. మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ విజయం ఖాయమైందని.. అందుకే విపక్షాలు అనవసర యాగీ చేస్తున్నాయంటూ కౌంటరిచ్చారు కేసీఆర్.

దుబ్బాక ఉప ఎన్నికలో విజయంపై ధీమా:
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఎన్నికలో ఆయన సతీమణి సుజాతమ్మకే అధికార పార్టీ టిక్కెట్ కేటాయించింది. ఇప్పటి వరకు దుబ్బాక ఎలక్షన్ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ధరణి ప్రారంభించిన తర్వాత చిట్‌చాట్ జరిపిన కేసీఆర్… కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విపక్షాల రాద్ధాంతాన్ని నమ్మే పరిస్థితిలో దుబ్బాక ఓటర్లు లేరని కేసీఆర్ కామెంట్ చేశారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణం:
నాలుగైదు రోజులుగా దుబ్బాకలో రాజకీయం మితిమీరుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉపఎన్నికను రక్తి కట్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంటిలోనే నగదు దొరికిందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. దానికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. అయితే అలాంటి వాటిని పట్టించుకోబోమంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. దుబ్బాక గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందన్న కేసీఆర్… ఎన్నికల వరకు అన్ని తతంగాలు నడుస్తుంటాయని ఆయన సెటైర్లు వేశారు. తమ పార్టీకి దుబ్బాకలో అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో హరీష్ దూకుడు:
ఇక దుబ్బాక ఉప ఎన్నిక దగ్గరపడుతుండటంతో.. మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. తెలంగాణ రాకముందు.. వచ్చాక రైతుల పరిస్థితి ఎలా ఉందో చూడాలంటూ.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తరఫున ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా.. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే అనే ధీమా టీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే.. మెజారిటీ ఎంత అనే విషయమే తేలాల్సి ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *