లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ఉద్యోగం ఊస్టింగేనా : ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Published

on

CM KCR key conference on RTC Pragathi Bhavan

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కార్మికులు చేపడుతున్న సమ్మె..ప్రభుత్వం విధించిన గడువు..తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్..చర్చిస్తున్నారు. 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం ప్రగతి భవన్‌కు మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ, ఇతర అధికారులు చేరుకున్నారు. కేసీఆర్..తో భేటీ అయి..చర్చిస్తున్నారు. కార్మికులు విధుల్లో చేరకపోవడం..అనంతరం నెలకొన్న పరిణామాలు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నవంబర్ 07వ తేదీ హైకోర్టు విచారణలో ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు వంద శాతం బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. నవంబర్ 05వ తేదీ మంగళవారం అర్ధరాత్రిలోగా విధులకు హాజరు కావాలి..సంస్థ తరపున నడుస్తున్న 10 వేల బస్సుల్లో 5 వేల ఒక వంద రూట్లకు ప్రైవేట్‌ పర్మిట్లు ఇచ్చేస్తాం..కార్మికుల సమ్మె వీడకపోతే అన్ని రూట్లను ప్రైవేటు అప్పగిస్తాం..అని నాలుగు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. కానీ వందల్లో మాత్రమే కార్మికులు చేరారు. 

అక్కడక్కడా కొంతమంది జాయినింగ్‌ లెటర్లు ఇచ్చినా.. అవి చెప్పుకోదగ్గ సంఖ్యలో మాత్రం లేవు. దీంతో సర్కార్‌పై కంటే యూనియన్లపైనే కార్మికులు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే 5 వేల 100 ప్రైవేట్‌ బస్‌ రూట్లకు ఆమోదముద్ర వేసిన సర్కార్‌.. ఈ మేరకు బస్‌లను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్‌ ట్రావెల్స్‌కే అప్పగించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
Read More : ముగిసిన డెడ్ లైన్ : ఆర్టీసీ ఫ్యూచర్‌పై అయోమయం

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *