లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కొత్త సచివాలయ డిజైన్ లో పలు మార్పులు సూచించిన సీఎం కేసీఆర్

Published

on

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్, సందర్శకుల వెయిటింగ్ హాల్, పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఇవాళ కూడా పలు ప్లాన్స్ ను పరిశీలించారు. గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్లాన్ పై అభిప్రాయానికి వచ్చిన ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులను సూచించాలని గత సమావేశంలో నిర్ణయించారు. అందుకనుగణంగా చేసిన మార్పులను ఈ రోజు పరిశీలించారు. ఈ రోజు పరిశీలించిన ప్లాన్ లో సీఎం కేసీఆర్ పలు మార్పులను సూచిస్తూ పలు సూచనలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వాలని సూచించారు.

సచివాలయం నిర్మాణినికి సంబంధించిన ప్లాన్ ఖరారు కాలేదు. సచివాలయంతోపాటు హెచ్ వోడీ లకు కూడా అందుబాటులో ఓ భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది. హెడ్ ఓడీ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలు దగ్గరగా నిర్మిస్తే పాలనకు సౌకర్యవంతంగా ఉంటుదన్న అభిప్రాయంతో ఓ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్ లో హెచ్ వోడీల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఇందుకు సంబంధించి కూడా సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది. ఈ రెండు అంశాలపై కూడా రాబోయే సమావేశం నాటికి డిజైన్లు ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సచివాలయ భవనాన్ని పరిశీలించినట్లైతే 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అందుకనుగుణంగా ప్రతి అంతస్తులోనూ సంబంధిత మంత్రులకు, కార్యదర్శులకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలి, ప్రతి ఫ్లోర్ లో కూడా డైనింగ్ హాల్ ను ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా విజిటర్ల కోసం వాహన సదుపాయాలను ఏర్పాటు చేయాలి. విజిటర్లు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి ఫ్లోర్ లో కూడా డైనింగ్ హాల్ కచ్చితంగా ఉండాలని ఆధునికంగా ఏర్పాటు చేసే టెక్నాలజీతో కొత్త సచివాలయ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఈరోజు సూచించిన ప్లాన్ లో కూడా పలు మార్పులను కేసీఆర్ ఆర్కిటెక్ లకు సూచించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *