cm kcr review on palle pragati

జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్వ్కాడ్స్ : అధికారులకు, ఎమ్మెల్యేలకు పరీక్ష

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం 2020 జనవరి 1 నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ

తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం 2020 జనవరి 1 నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ స్వ్కాడ్స్ పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరుని, నాణ్యతను పరిశీలిస్తాయన్నారు. ఆకస్మిక తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాయని సీఎం చెప్పారు. సెప్టెంబర్ లో 30 రోజులు చేసిన పల్లె ప్రగతి మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం అన్నారు. 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందని చెప్పారు.

దిద్దుబాటు చర్యల కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖను పటిష్టపరిచామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు ఇస్తున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇది పరీక్షలాంటిది అని సీఎం కేసీఆర్ అన్నారు.

2020 జనవరి 2 నుంచి రెండో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గ్రామాలకు మరింత శోభను ఇచ్చే విధంగా మలివిడత కార్యక్రమంపై ప్రభుత్వం ప్రత్యేత దృష్టి పెట్టింది. ముఖ్యంగా గ్రామాల్లో సంకాంత్రి సందడి ప్రారంభమయ్యే లోగానే పల్లెలకు కొత్త అందాలను తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జనవరి 2న ప్రారంభమై 10 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఏకధాటిగా కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం.. పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడేలా గ్రామాలను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

* పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
* 2020 జనవరి 1 నుంచి రెండో విడత పల్లె ప్రగతి
* పల్లె ప్రగతి పనుల పరిశీలన కోసం ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు
* ఆకస్మిక తనిఖీలు చేయనున్న స్వ్కాడ్స్
* కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు పనుల్లో ఉత్సాహం చూపడం లేదన్న సీఎం కేసీఆర్
* పనిచేయని ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని సీఎం వార్నింగ్
* పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల
* గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపడాలన్న సీఎం కేసీఆర్

READ  పట్టణాలు, పల్లెల్లో కరోనా పంజా.. వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు.. హైదరాబాద్‌లో నిలకడగా

Related Posts