CM KCR review on RTC

విధులకు హాజరైనవారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎస్ జోషి, డీజీపీ, అడ్వకేట్ జనరల్‌తో సుమారు 9 గంటలకు పైగా కేసీఆర్ చర్చలు జరిపారు. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ 100 శాతం ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. వంద శాతం బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది.

నవంబర్ 5వ తేదీ మంగళవారం అర్ధరాత్రిలోగా విధులకు హాజరు కావాలి..సంస్థ తరపున నడుస్తున్న 10 వేల బస్సుల్లో 5 వేల ఒక వంద రూట్లకు ప్రైవేట్‌ పర్మిట్లు ఇచ్చేస్తాం..కార్మికుల సమ్మె వీడకపోతే అన్ని రూట్లను ప్రైవేటు అప్పగిస్తాం..అని నాలుగు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. కానీ వందల్లో మాత్రమే కార్మికులు చేరారు. అక్కడక్కడా కొంతమంది జాయినింగ్‌ లెటర్లు ఇచ్చినా.. అవి చెప్పుకోదగ్గ సంఖ్యలో మాత్రం లేవు.

దీంతో సర్కార్‌పై కంటే యూనియన్లపైనే కార్మికులు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే 5 వేల 100 ప్రైవేట్‌ బస్‌ రూట్లకు ఆమోదముద్ర వేసిన సర్కార్‌.. ఈ మేరకు బస్‌లను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్‌ ట్రావెల్స్‌కే అప్పగించింది. 
 

Related Posts