ఏపీ కెలికి కయ్యం పెట్టుకుంటుంది.. :కేసీఆర్ సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిపై వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అక్రమాలంటూ ఆరోపిస్తున్న ఏపీకి సరైన సమాధానం చెబుతామని కేసీఆర్ అంటున్నారు.ఈ మేరకు మాట్లాడిన సీఎం కేసీఆర్.. ‘అపెక్స్ కౌన్సిల్ లో ఏపీ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రభుత్వ వాదనలను సమర్థవంతంగా వినిపిస్తాం. ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులకు అడ్డు చెప్పడం సరికాదు. ప్రాజెక్టులను నిర్మిద్దామని ఏపీ ప్రభుత్వానికి స్నేహ హస్తం అందించాం. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు వినిపిస్తోంది. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని వినియోగించుకుందామని చెప్పాం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానాలను అవలంభిస్తోంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.


Related Posts