లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఆరంభం : కేసీఆర్

Published

on

తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. సమైక్య రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థలో 160, 170 చట్టాలు ఉండేవన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు ఉన్నాయని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఆరంభమన్నారు.రెవెన్యూ చట్టంలో తొలి అడుగు వేశామన్నారు. ధరణి ఒక్కటే కాదు.. మిగిలినవి కూడా ఉంటాయని కేసీఆర్ చెప్పారు. రెవెన్యూ సంస్కరణల్లో తొలి అడుగు వేశామని అన్నారు. ఆర్ఓఆర్, ధరణి వెబ్ సైట్ సర్వస్వం కాదని చెప్పారు. విపక్షాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.


చచ్చిపోతే..ప్రభుత్వం చదివిస్తుందని తండ్రి ఆత్మహత్యాయత్నం


కోటి 45 లక్షల 58వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామన్నారు. ఈ కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవన్నారు. 48 గంటల్లోనే అందరికి సాయం చేశామన్నారు. రైతుబంధు ప్రతి రైతుకు వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. 57.90 లక్షల మంది రైతులకు రూ.7279 కోట్లు అందజేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో పీటముడులు ఉంటాయన్నారు.అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చట్టాన్ని తీర్చిదిద్దుతామన్నారు. పాలకులు ప్రేక్షక పాత్ర పోషించడం నేరమవుతుందన్నారు. కన్ ఫ్యూజ్ అయితే చట్టాన్ని లోతుగా అర్థం చేసుకోలేరని కేసీఆర్ చెప్పారు. ప్రజల మార్పును సులభంగా అంగీకరించరని చెప్పారు. రైతుబంధు కింద 48 గంటల్లో రూ.7279 కోట్లు ఇచ్చామన్నారు. 57లక్షల 97వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అన్ని భూవివాదాలకు సర్వే ఒక్కటే పరిష్కారమని కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూకు సంబంధించి అన్ని చట్టాలను తొలగించడం లేదని కేసీఆర్ తెలిపారు. ఒక్క చట్టంతో అంతా మారిపోతుందంటే అనేక అనుమానాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. ప్రతిచోటా లిటిగేషన్లు ఉంటాయని అనుకోకూడదని చెప్పారు.గతంలో జాగా లేకున్నా సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. నా సొంతూళ్లోనే 90 ఎకరాలు ఉంటే 120 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చిన భూమికి దారి లేదు. గట్లు లేవు.. ఇలాంటి తప్పులన్నింటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నింటిని ఒకేసారి సరిచేయలేమని, దశలవారీగా పరిష్కరించాలని సూచించారు. 1962 నుంచి 2003 వరకు వక్ఫ్ భూముల సర్వేపై 62 గెజిట్లు ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. 77,538 ఎకరాల వక్ఫ్ భూమికి ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని చెప్పారు. ఈ భూమి మొత్తాన్ని కాపాడుతామని హామీ ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే తర్వాతే సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అన్నారు.

77వేల ఎకరాల వక్ఫ భూముల క్రయవిక్రయాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. రేపట్నించి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తున్నట్టు తెలిపారు. అటవీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క గుంట కూడా అటవీ భూమి కబ్జా కానివ్వమన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి పట్టాలిస్తామన్నారు. సాదాబైనామా విషయంలో లిబరల్ గా వ్యవహరించామని చెప్పారు. జీవో 58, జీవో 59ని పొడిగించేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలు సంతోషంగా ఉండాలన్నదే మా విధానమన్నారు.

గతంలో భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదన్నారు. జాగా లేకుండా ఇష్టా రాజ్యంగా సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్లు పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు ధరణి పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ ఉంటుందని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *