cm kcr on tsrtc strike

ఆర్టీసీ సమ్మె : డెడ్ లైన్ లోగా చేరకపోతే ఉద్యోగాలు ఉండవు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్‌. మిగిలిన 5 వేల

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం మరోసారి అల్టిమేటం జారీ చేసింది. మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్‌. మిగిలిన 5 వేల రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అదే జరిగితే తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని కామెంట్ చేశారు‌. 5వ తేదీ అర్థరాత్రి లోపు విధుల్లో చేరిన వాళ్లని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సోమవారం(నవంబర్ 4,2019) సమీక్ష నిర్వహించారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ హాజరయ్యారు. ఇప్పటివరకు ఎంతమంది విధుల్లో చేరారనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు.

మంగళవారం అర్థరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కోరారు. డెడ్ లైన్ లోగా కార్మికులు విధుల్లో చేరకపోతే రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని తేల్చి చెప్పారు. విధుల్లో చేరాలా వద్దా అన్నది కార్మికులే నిర్ణయించుకోవాలన్నారు. గడువులోగా కార్మికులు విధుల్లోకి చేరకపోతే మిగతా 5 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత కొద్ది రోజుల్లోనే రూట్లకు పర్మిట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. హైకోర్టులో జరుగుతున్న విచారణ చూపించి కార్మికులను యూనియన్ నాయకులు మభ్యపెడుతున్నారని సీఎం ఆరోపించారు. కార్మికుల భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు.

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని కార్మిక శాఖ నివేదిక ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్లే అంతులేని పోరాటం చేయాల్సి వస్తుందని ఆర్టీసీ కార్మికులను హెచ్చరించింది ప్రభుత్వం.

Related Posts