లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సీరంని సందర్శించిన సీఎం..అగ్నిప్రమాదంతో వెయ్యికోట్లకు పైనే నష్టం

Updated On - 8:59 pm, Fri, 22 January 21

CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,ఆదిత్యఠాక్రే సందర్శించారు. అధికారులతో మాట్లాడి అగ్రిప్రమాద ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం వల్ల వెయ్యి కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగిందని ఆ సంస్థ సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. పూణేలోని మంజరి ప్లాంట్‌ లో నిర్మాణంలో ఉన్న భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరించారు. ఈ ప్రమాదం వల్ల కరోనా టీకా కోవిషీల్డ్‌ ఉత్పత్తి, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. భవిష్యత్తులో ఉత్పత్తి చేసే బీసీజీ టీకా కోసం నిర్మాణం జరుగుతున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన భవనానికి దూరంగా కరోనా టీకా ఉత్పత్తి జరుగుతున్నదని, దీంతో వ్యాక్సిన్లకు ఎలాంటి నష్టం లేదన్నారు.

మరోవైపు, నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదం జరిగిందా అన్న మీడియా ప్రశ్నకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బదులిచ్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని, అది పూర్తయ్యే వరకు ఎలాంటి స్పష్టతకు రాలేమని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు. సీరమ్‌ సంస్థలో మంటలు వ్యాపించినట్లు వార్తలు వచ్చాయని అయితే అదృష్టవశాత్తు కరోనా టీకా తయారీ, నిల్వలు వేరే చోట ఉండటంతో వాటిపై ఎలాంటి ప్రభావం లేదన్నారు.

ఐదుగురి మరణానికి కారణమైన అగ్నిప్రమాద ఘటనకు గల కారణాన్ని నిర్థారించేందుకు శుక్రవారం మూడు మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తుని ప్రారంభించాయి. పూణే మున్సిపల్(PMC),పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(PMRDA),మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(MIDC)అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.