'Go Care Consumption'

గోవుల కోసం యోగి : ‘గో సంరక్షణ సెస్‌’ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గో సంరక్షణ అంటు జపం చేస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్‌ ఆమోదించింది. ‘గో సంరక్షణ సెస్‌’ పేరుతో

ఉత్తరప్రదేశ్‌ : గో సంరక్షణ అంటు జపం చేస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్‌ ఆమోదించింది. ‘గో సంరక్షణ సెస్‌’ పేరుతో దీన్ని అమలు చేయనున్నారు. పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో ‘గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌’లను ఏర్పాటు చేసి..గ్రామ పంచాయతీలు..మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మిస్తారు. 

ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంరక్షించే స్థోమత లేక చాలా మంది రైతులు తమ పశువులను వదిలేస్తున్నారని..ఇటువంటి షెడ్స్ లో ఆవులకు వాటికి ఆశ్రయం లభిస్తుందన్నారు. అలాగే రోడ్లపై తిరిగే పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. సంబంధిత విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తారని అధికారులు వెల్లడించారు.
 

Related Posts