లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బాబు కూల్చిన గుళ్ళు పునర్నిర్మాణం – సీఎం జగన్ శంకుస్ధాపన

Published

on

CM YS Jagan lay stone temples demolished during tdp rule in vijayawada :  చంద్రబాబు నాయుడు  ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చేసిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలోని సీతమ్మవారి పాదాల దగ్గర భూమిపూజ  చేయనున్నారు. మొత్తం విజయవాడలోని 9 ఆలయాలను పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు..  రూ. 77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. భూమి పూజ అనంతరం వైఎస్‌ జగన్‌ ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని.. అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 40 దేవాలయాలకు పైగా చంద్రబాబు కూల్చారంటూ ఆరోపించారు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. తిరిగి వాటన్నింటినీ పునర్నిర్మించబోతున్నామని ఆయన చెప్పారు.

విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..
♦రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం

♦రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
♦రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో)
♦రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం

చంద్రబాబు నాయుడు హయాంలో కూల్చివేసిన గుళ్లు పునర్నిర్మాణానికి శుక్రవారం ఉదయం శంకుస్ధాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్
cm jagan

 

విజయవాడ దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులు..
♦రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం
♦రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
♦రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం

♦రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
♦రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం
♦రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్‌ రోడ్‌లో మరమ్మతులు
♦కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు
♦రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులు