లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీలో రూ.17వేల కోట్ల ఖర్చుతో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు

Published

on

Nadu-Nedu in health department: వైద్య ఆరోగ్య రంగంలో నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని ఇతర అధికారులు హాజరయ్యారు. నాడు-నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు, ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, అలాగే సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించారు. నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై సమగ్రంగా అధికారులతో సమీక్షించారు. మొత్తంగా వీటికి రూ.17వేల 300 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

* ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలి
* ప్రతి అంశానికీ బాధ్యులు ఉండాలి
* ఆస్పత్రిలో పరికరాల దగ్గర నుంచి ఏసీల వరకూ ప్రతిదీ సక్రమంగా పని చేయాలి
* అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాటి నిర్వహణ బాగోలేదనే మాట రాకూడదు
* 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా తీసుకువస్తున్నాం
* భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఏర్పాట్లు చేస్తున్నాం
* ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు
* ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు


* జనరేటర్లు పని చేయడం లేదు, ఏసీలు పని చేయడం లేదు, శుభ్రత లేదు, శానిటేషన్‌ లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు
* కార్పొరేట్‌ ఆస్పత్రులతో దీటుగా ఉండాలి
* ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలన చేసి వాటిని పాటించండి
* పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు నవంబరు లోగా టెండర్లు
* అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు డిసెంబర్ లో టెండర్లు
* విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు
* వీటి కోసం రూ.7500 కోట్లకుపైగా ఖర్చు
* ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు-నేడు పనులకు మరో రూ. 5వేల 472 కోట్లు ఖర్చు
* వీటికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశం
* నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలని సీఎం ఆదేశం
* ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానం బాగుండాలి
* వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేంతవరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి
* అక్కడున్న హెల్త్‌ అసిస్టెంట్‌/ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్‌ చేయించాలి
* ఎంపానల్‌ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచండి
* ఎవరైనా వైద్యం కావాలనుకుంటే.. ఆ రోగికి మార్గనిర్దేశం చేయాలి
* ఈ నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీకింద 2 వేల వ్యాధులకు(ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతుంది) మిగిలిన 6 జిల్లాల్లో (శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం) చికిత్స
* దీంతో అన్ని జిల్లాలకూ అందుబాటులోకి వస్తోంది
* అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను ఈ జాబితాలో చేర్చండి
* అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *