లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలు!

Published

on

CM Ys Jagan to Review on Own House for people : ఏపీలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలకు సైతం సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. తక్కువ ధరలకే క్లియర్‌ టైటిల్‌తో వివాదాల్లేని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఈ ఆలోచన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్‌ శాఖకు సంబంధించి తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట ఓ కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఉద్దేశమని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఫ్లాట్లకు బదులుగా వివాదాల్లేని క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు స్థలాలు ఇవ్వాలన్నది ఆలోచనగా తెలిపారు.

ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తుందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుకున్న వారికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. సరైన టైటిల్‌ ఉందా? అనుమతులు ఉన్నాయా లేదనే భయాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమం ద్వారా అన్నింటికి శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. 17 వేల కాలనీలు కడుతున్నామని జగన్ చెప్పారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టి పెట్టండని కలెక్టర్లకు చెప్పామని తెలిపారు.

ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా ఆలోచించమని చెప్పాం. లే అవుట్‌ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయాలని సూచించినట్టు తెలిపారు. బస్‌ బే తోపాటు సృజనాత్మకంగా బస్టాప్‌ కట్టాలని చెప్పామన్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకు పైగా లే అవుట్స్‌ వచ్చాయి. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే.. మరో 17 వేల కాలనీలు కడుతున్నామని తెలిపారు. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు.