లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

india

ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలనేది కేంద్రం ఇష్టమే..

Published

on

COVID-19 vaccine

వ్యాక్సినేషన్ ప్రజలకు పంపిణీ చేసేందుకు కేంద్రం పకడ్బంధీ చర్యలు తీసుకుంది. వ్యాక్సినేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఈ యాప్ సాయంతో కోటి మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆస్ట్రాజెనెకా, కొవాగ్జిన్ లు వేయనున్నారు. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.

తొలిదశలో జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సిన్లకు దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ టీకాల్లో ఎవరికి ఏది వేయాలనేది ప్రభుత్వమే కన్ఫామ్ చేస్తుందని వెల్లడించింది. ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు మనకు లేనట్లే కనిపిస్తుంది. వచ్చే 8 నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలనేదే ప్రభుత్వం లక్ష్యం.

16.5 లక్షల కోవాగ్జిన్‌ డోసులు ఫ్రీ:
భారత్‌లోని పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఈ కంపెనీ నుంచి 1.1 కోట్ల టీకా డోసేజ్, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల డోసేజ్ కొనుగోలుకు సెంట్రల్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ఫైనల్ చేసింది. తొలి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు గవర్నమెంట్‍‌కు విక్రయించనున్నట్లు సీరం కంపెనీ సీఈవో అదార్‌ పూనావాలా స్పష్టం చేశారు. ట్యాక్సులతో కలుపుకుంటే ఒక్క డోసేజ్ ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్‌ ధర ట్యాక్సులు లేకుండా రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.50 అవుతుంది.

గవర్నమెంట్ అగ్రిమెంట్‌లో 55 లక్షల డోసులు కొనుగోలు చేసుకోవాలని ఉండగా.. ఇందులో 16.5 లక్షల డోసులను ఫ్రీగా సప్లై చేస్తామని భారత్‌ బయోటెక్‌ ప్రామిస్ చేసింది. ఇలా చూస్తే కోవాగ్జిన్‌ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు అవుతుందని అధికారులు వెల్లడించారు. విమానాల్లో తొలుత మెయిన్ సిటీలకు, అక్కడి నుంచి సెకండ్ స్టేజ్ సిటీస్, టౌన్లకు సేఫ్‌గా, స్పీడ్‌గా చేరవేయనున్నారు. కరోనా టీకా సెకండ్ డోస్ పూర్తి అయిన 14 రోజుల తర్వాతే దాని ఎఫెక్ట్ కనిపిస్తుందని సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ బుధవారం వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *