ఫోన్లో అసభ్యంగా వేధిస్తున్న వ్యక్తి….ఇంటికి రమ్మన్న తల్లీకూతుళ్లు…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Coimbatore man murdered by young woman : భర్తను కోల్పోయి కూతురితో కలిసి జీవిస్తున్న మహిళ కుటుంబాన్ని ఫోన్లో వేధిస్తున్న వ్యక్తిని.. తల్లీ కూతుళ్లు హతమార్చిన ఘటన తమిళనాడులో జరిగింది.

సుజాత అనే మహిళ భర్త కొ్నేళ్ల క్రితం మరణించాడు. ఆమె తన కుమార్తె శ్రేయ(23)తో కలసి కోయంబత్తూరులోని కరామడైలో నివసిస్తోంది. ఒక వారం క్రితం శ్రేయ నెంబరుకు మిస్డ్ ఫోన్ కాల్ వచ్చింది. అది ఎవరు చేశారా అని ఆమె తిరిగి  ఆ నెంబరుకు ఫోన్ చేసి తెలియని వారవటంతో ఫోన్ కట్ చేసింది.ఇక ఆ తర్వాత నుంచి అదే నెంబరు నుంచి శ్రేయ ఫోన్ కు కాల్ చేసి… అవతలి వ్యక్తి అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడటం మొదలెట్టాడు. శ్రేయ ఫోన్ కట్ చేసినా మళ్లీ మళ్లీ చేసి వేధించటం మొదలెట్టాడు. అతని వేధింపులు భరించలేని శ్రేయ ఆ ఫోన్ కాల్ వాయిస్ రికార్డింగ్ చేయటం మొదలు పెట్టింది.

ఈ విషయం తన తల్లి సుజాతకి కూడా చెప్పింది. పోన్ కాల్స్ చేస్తున్న వ్యక్తి కోయంబత్తూరులోని రతినాపురి, అరుల్ నగర్ లో ఉండే ఎన్.పెరియ సామి గా గుర్తించారు. ఈ వేధింపుల భరించలేని తల్లి కూతుళ్లు అతడ్ని పిలిచి వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు.రోజూ లాగానే పెరియసామి మంగళవారం,అక్టోబర్ 20వ తేదీన శ్రేయకు ఫోన్ చేసి అశ్లీలంగా మాట్లాడటం మొదలెట్టాడు.అతడితో సౌమ్యంగా మాట్లాడి…. మధ్యాహ్నం 2 గంటలకు పెరియార్ నగర్ రమ్మని శ్రేయ చెప్పింది. ఆమె చెప్పిన టైమ్ కు పెరియసామి ఉత్సాహంగా వారి ఇంటి ముందు వాలిపోయాడు.

ఇంట్లోనుంచి  యటకు వచ్చిన తల్లి కూతుళ్ళు ..పెరియసామిని ఎందుకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. అతను చెప్పిన సమాధానాలతో వారికి మరింత కోపం వచ్చింది. వారి ముగ్గురి మధ్య వాగ్యుధ్ధం జరిగింది. వాదన తీవ్రతరం కావడంతో తల్లీ కూతుళ్లు సమీపంలోని రాడ్లు తీసుకుని రామసామి పై దాడి చేసి చితక్కొట్టారు.ఈ క్రమంలో అతని తల, ముఖం, కాళ్లపైనా తీవ్ర గాయాలయ్యాయి. వారు కొట్టిన దెబ్బలకు రామసామి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈఘటన చూసిన స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్దలానికి వచ్చిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్నికోయంబత్తూరు మెడికల్ కాలేజీకి తరలించారు. మహిళలపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Related Tags :

Related Posts :