Home » వెయ్యి సంవత్సరాలుగా సెల్ఫ్ లాక్డౌన్లో గ్రామం.. మగాళ్లకు నో ఎంట్రీ
Published
2 weeks agoon
Self Lockdown:ఎనిమిది నెలల లాక్డౌన్.. తప్పనిసరి క్వారంటైన్ మనకు ఈ కొవిడ్-19 నేర్పిన పాఠాలు. కానీ, ఆ గ్రామంలో ఉన్న వారంతా 1000 సంవత్సరాలుగా లాక్డౌన్లోనే ఉంటున్నారట. నాలుగు గేట్లు ఉన్న పాత కోటలోనే వారంతా బతుకుతున్నారు. ఇక ఆ కోటలో ఉండే మహిళలైతే కాలు కూడా బయటపెట్టలేదు. పెళ్లిళ్లు కూడా ఆ కోటలో ఉండే బంధు వర్గం మధ్యలోనే జరిగిపోతాయి.
ఆ సంబరాలు కోటలో ఉండే కులం కాకుండా ఇతర కులాల మహిళలను మాత్రమే అనుమతిస్తారు. ఒకవేళ చనిపోయినా.. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. పాపం అక్కడున్న వృద్ధులు చనిపోవడంతో సంప్రదాయాలు కూడా మర్చిపోయారు అక్కడి వారు.
ఇక మగాళ్ల విషయానికొస్తే బయటకు వచ్చి ఏదైనా పని చేసుకుని వెళ్లిపోతారు. అంతే కానీ, ఇతర మగాళ్లు లోనికి రావడానికి మాత్రం ఒప్పుకోరు.
మనం లాక్డౌన్ నుంచి రికవరీ అయ్యాక.. ఇటువంటి వారు వెయ్యి సంవత్సరాలుగా ఆ నాలుగు గేట్లలోపలే ఎలా ఉంటున్నారనే ప్రశ్న మొదలైంది. ఇంతకీ ఇదెక్కడుందంటే.. దక్షిణ తమిళనాడులోని తంబ్రపర్నీ నది ఒడ్డున ఉన్న శ్రీవైకుంఠం గ్రామానికి సంబంధించిన కథ ఇది. ఇందులో కొట్టాయ్ అంటే కోట అని, పిల్లమార్ అనేది ఉప కులం అని.