Complete Family Entertainer Tholubommalata gets Clean 'U'

‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి – నవంబర్ 22 విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి.. నవంబర్ 22 విడుదల..

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కుటుంబ కథా చిత్రం.. ‘తోలుబొమ్మలాట’.. ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మించగా.. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహించారు.

సంగీత, విశ్వంత్, వెన్నెల కిషోర్, ధనరాజ్, నర్రా శ్రీను, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read Also : ‘రూలర్’ – బాలయ్య అస్సలు తగ్గట్లేదుగా!

రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ టీమ్ క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు. రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ‘తోలుబొమ్మలాట’ నవంబర్ 22న విడుదల కానుంది. సంగీతం : సురేష్ బొబ్బిలి. 

Related Tags :

Related Posts :