లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు : ఖైదీ 2 కాన్సెప్ట్ పోస్టర్

కార్తీ, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘ఖైదీ’ కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తెరకెక్కనుంది..

Published

on

Concept Design for Karthis's Kaithi 2

కార్తీ, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘ఖైదీ’ కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తెరకెక్కనుంది..

కార్తీ నటించిన ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్ భాషల్లో భారీగా విడుదలైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఖైదీ’ మూవీకి అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాకుండా.. ‘కల్ట్ క్లాసిక్ మూవీ, హీరోయిన్, పాటలు వంటి కమర్షియల్ అంశాలకు పోకుండా జెన్యూన్‌గా తీసిన సినిమా’.. అంటూ ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.. మూడో వారంలోనూ అత్యధిక థియేటర్లలో నడుస్తోంది ‘ఖైదీ’. ఇటీవల ‘ఖైదీ’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని దర్శకుడు లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒక్క రాత్రిలో జరిగిన కథను హీరోయిన్, సాంగ్స్ లేకుండా.. అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు పొందిన లోకేశ్ కనకరాజ్.. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లు యావజ్జీవ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కార్తి.. పోలీసులకు సాయం చేసే సందర్భంలో తన గతాన్ని వివరిస్తాడు. తన భార్య ఎలా చనిపోయిందనే విషయాన్ని చెబుతూ బాధ పడతాడు. తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు తన ముందే దారుణానికి పాల్పడుతుంటే, వాళ్లలో ఒకరి చంపి తాను జైలుకు వెళ్లానని చెబుతాడు. ఇక క్లైమాక్స్‌లో కార్తిని చూసి ‘వాడు సంబంధం లేనివాడు కాదురా.. వాడి పేరు ఢిల్లీ’ అంటూ విలన్ చెప్పే డైలాగ్ గురించి ప్రేక్షకుల్లో సందేహం వస్తుంది. కార్తి భార్య చనిపోవడం వెనుక డ్రగ్స్ ముఠా నాయకుడైన విలన్ పాత్ర ఉంటుందనే డౌట్ వచ్చేలా డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్లే రెండో భాగం కథను లోకేశ్ కనకరాజ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also : బాడీ షేప్ చూశారా.. ఎంత సాలిడ్‌గా ఉందో!

మొదటి భాగంలో కనిపించని హీరోయిన్ రెండో భాగంలో కనిపించే ఛాన్స్ ఉందని కోలీవుడ్ టాక్.. ఇదిలా ఉంటే కార్తీ ‘ఢిల్లీ’గా కనిపించబోయే ‘ఖైదీ 2’ కాన్సెప్ట్ డిజైన్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా అఫీషియల్‌గా విడుదల చేసింది చిత్రబృందం.. హరీష్ ఉత్తమన్, కార్తీ, బేబి మౌనికలతో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.. ‘10 సంవత్సరాల క్రితం ఢిల్లీ ఎలా ఉండేవాడు అనేది ఈ సీక్వెల్‌లో చూపించనున్నాం.. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాం’ అని మూవీ టీమ్ తెలిపింది.. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ 64వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత ‘ఖైదీ 2’ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *