ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల గొడవ….నమ్మించి స్నేహితుడి హత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

conflict for girlfriend : ఒకటే  హృదయం కోసము ఇరువురి పోటీ దోషము…… అని సినీ కవి దాశరధి 1963లోనే చదువుకున్న అమ్మాయిల సినిమా కోసం ఓ పాట రాశారు. ఈపాట రొమాంటిక్ గా పాడుకోటానికి బాగానే ఉంది కానీ….. గుంటూరు జిల్లాలో ఒకే ప్రియురాలి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన వైరం వారిలో ఒకరికి ప్రాణాల మీదుకు తెచ్చింది.

గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్ చంద్ స్నేహితులు. ప్రేమ్ చంద్ కు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తనవద్ద ఫోన్ లేకపోవటంతో గోపీ ఫోన్ తోనే ఆ మహిళతో మాట్లాడేవాడు.

అయితే ప్రేమ్ చంద్ కు తెలియకుండా…గోపీ కూడా ఆ మహిళతో పరిచయం పెంచుకుని మాట్లాడటం మొదలెట్టాడు. కొన్నాళ్లకు ఈ విషయం ప్రేమ చంద్ కు తెలిసింది. ఈ విషయమై గోపీ, ప్రేమ చంద్ ల మధ్య ఇటీవల పలుమార్లు వాగ్వాదం కూడాజరిగింది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన ప్రేమ్ చంద్ గోపీని కలవాలని కబురు పంపాడు.

అదే రోజు రాత్రి గోపీ యడ్లపాడు-నాదెండ్ల మార్గంలోని చప్టా వద్ద ప్రేమ్ చంద్ ను కలిశాడు. అక్కడ అప్పటికే గడ్డి మందు కలిపి సిధ్దం చేసి ఉంచిన కూల్ డ్రింక్ ను ఫ్రెండ్ కు ఆఫర్ చేసి తాగమన్నాడు. పూర్తిగా తాగిన తర్వాత గోపీకి అసలు విషయం చెప్పాడు. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపానని …ఇంటికి వెళ్లి గోపీ తన తల్లితండ్రులకు ఈ విషయం చెప్పాడు.

వారు వెంటనే అతడ్నిఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించటం మొదలెట్టారు… కాగా …..అతని ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండటంతో అక్టోబర్ 7న  గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించి ..పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చికిత్స పొందుతూ గోపీ వర్మ శనివారం ఉదయం మరణించాడు.  నమోదు చేసుకున్న యడ్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts