లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

నాగార్జున సాగర్ కాలువలో గల్లంతైన రేణుకా చౌదరి పీఏ

Published

on

Congress EX-MP Renuka chowdary PA missed in nagarjunasagar canal : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వ్యక్తగత సహాయకుడు రవి ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. రవి రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా నగరంలో గుర్తింపు పొందారు.

ఖమ్మం జిల్లాకు చెందిన రవి రేణుకా చౌదరి పీఏ గా పనిచేస్తున్నారు. అతను బుధవారం ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లారు. ఈతకు దిగిన కొద్ది సేపటికే అతను నీటిలో మునిగిపోయాడు. కాలువ సమీపంలో రవి బుల్లెట్ , చెప్పులు బ్యాగ్ ఉన్నాయి. స్ధానికులు రవి గురించి అక్కడ విచారించగా నీటిలో కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు కాలువలో గాలింపు చేపట్టారు అయినా రవి మృతదేహాం లభ్యం కాలేదు. రని దాదాపు 11 కిలోమీటర్లు నిర్విరామంగా ఈత కొడతాడని స్ధానికులు తెలిపారు. సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన తర్వాత రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో గల్లంతై ఉంటాడని సమాచారం.