స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు.. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఐదుగురు, ఇతరులు 13మంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత దేశపు అతి పురాతన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ లో లీడర్ షిప్ వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనేది చర్చకు దారి తీసింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలకు చెందిన వారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలా? వేరే వాళ్లకు అవకాశం ఇవ్వరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.సుదీర్ఘ కాలం అధ్యక్ష పదవిలో ఉన్నది నెహ్రూ-గాంధీ కుటుంబం వారే:
కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా బయటివారికి అవకాశం ఇవ్వడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. ఒకసారి చరిత్రను గమనిస్తే స్వాతంత్ర్యం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి 13 మంది ప్రెసిడెంట్లు బయటి వారే. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వారు ఐదుగురు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, బయటి వ్యక్తులతో పోలిస్తే సుదీర్ఘ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగింది మాత్రం నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే.

నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు:
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. స్వాతంత్ర్యం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసింది వీరే. సోనియా గాంధీ సుదీర్ఘ కాలంగా అధ్యక్షురాలిగా ఉన్నారు. కాగా, సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన 20కిపైగా సీనియర్లు రాసిన లేఖ కలకలం రేపింది. అయితే ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ను నియమించే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని వారంతా కోరడం జరిగింది. దీంతో ప్రెసిడెంట్ వివాదం కొన్ని రోజుల వరకు సద్దుమణిగినట్టు అయ్యింది.నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పని చేసిన 13మంది బయటి వ్యక్తులు వీరే:
కృపలానీ
పట్టాబి సీతారామయ్య
పురుషోత్తమ్ దాస్ టాండన్
దేబ్ దర్
నీలం సంజీవ రెడ్డి
కామరాజ్
నిజలింగప్ప
జగ్జీవన్ రామ్
శంకర్ దయాల్ శర్మ
బారోహ్
కేబీ రెడ్డి
పీవీ నరసింహారావు
సీతారామ్ కేసరికాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఏడాది పదవీ కాలం ముగిసింది. ఇంక ఇప్పుడు పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షులను ఎన్నుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు భావించారు. ఈ నేపథ్యంలో 23 మంది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో పైనుంచి కిందవరకూ అనేక మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో సూచించారు. ఈ లేఖ కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేపింది.

READ  ఎందుకో : శశికళతో రాములమ్మ మంతనాలు

కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా గాంధీలే కొనసాగుతారా?
కాగా, కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా గాంధీలే కొనసాగుతారా? వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వరా? అని ప్రశ్నించే వాళ్లూ లేకపోలేదు. ముందుండి పార్టీని నడిపించాల్సిన రాహుల్ గాంధీ ఏమో.. బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. పోనీ బయటి వారికి ఇస్తారా అంటే అదీ ఇవ్వరు. దీంతో కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే పార్టీకి కష్టాలు తప్పవని, మోడీ సారథ్యంలోని బీజేపీతో పోరాటం చేయడం చాలా కష్టం అని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడాలన్నా, భవిష్యత్తులో సత్తా చాటాలన్నా సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకులు అంటున్నారు.


Related Posts